Travel Tips: ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ జర్నీ ఇక ఈజీ...! పక్కపక్కనే సీట్లు గ్యారెంటీ! Flight Booking: విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు క్యాన్సిలేషన్ ఫ్రీ..! కొత్త రిఫండ్ రూల్స్ ఇవే..! Special Train: ఏపీ మీదుగా 6 ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు, ఫుల్ షెడ్యూల్ ఇవే.. Aviation India: విమానయానంలో భారత్ వరల్డ్ రికార్డ్..! ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఘనత! Summer Trip: మన రూపాయి అక్కడ రాజా.. కేవలం వేలల్లోనే విదేశీ పర్యటన... Dangerous Dams: ప్రపంచంలోనే 10 ప్రమాదకరమైన డ్యామ్‌లు..! వీటి వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే! APSRTC: ఏపీలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..! ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్! Free Bus: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్... గిరి ప్రదక్షిణకు ఉచిత బస్సు సేవలు ప్రారంభం! Railway Insurance: టికెట్ ఎక్కడ కొన్నా బీమా ఉండాల్సిందే..! రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం! IRCTC ధార్మిక యాత్ర! 12 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మే 28న ప్రారంభం! Travel Tips: ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ జర్నీ ఇక ఈజీ...! పక్కపక్కనే సీట్లు గ్యారెంటీ! Flight Booking: విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు క్యాన్సిలేషన్ ఫ్రీ..! కొత్త రిఫండ్ రూల్స్ ఇవే..! Special Train: ఏపీ మీదుగా 6 ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు, ఫుల్ షెడ్యూల్ ఇవే.. Aviation India: విమానయానంలో భారత్ వరల్డ్ రికార్డ్..! ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఘనత! Summer Trip: మన రూపాయి అక్కడ రాజా.. కేవలం వేలల్లోనే విదేశీ పర్యటన... Dangerous Dams: ప్రపంచంలోనే 10 ప్రమాదకరమైన డ్యామ్‌లు..! వీటి వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే! APSRTC: ఏపీలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..! ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్! Free Bus: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్... గిరి ప్రదక్షిణకు ఉచిత బస్సు సేవలు ప్రారంభం! Railway Insurance: టికెట్ ఎక్కడ కొన్నా బీమా ఉండాల్సిందే..! రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం! IRCTC ధార్మిక యాత్ర! 12 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మే 28న ప్రారంభం!

Travel Tips: ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ జర్నీ ఇక ఈజీ...! పక్కపక్కనే సీట్లు గ్యారెంటీ!

Travel Tips: విమాన ప్రయాణాల్లో ఉన్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. ఇకపై ప్రతి విమానంలో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని, వెబ్ చెక్-ఇన్ పేరుతో అదనపు బాదుడు ఉండకూడదని ఆదేశించింది.

Published : 2026-03-18 19:37:00

పెట్స్ మరియు స్పోర్ట్స్ కిట్లకు ఇక ఫిక్స్‌డ్ ఛార్జీలు…

విమానయాన సంస్థలకు కేంద్రం వార్నింగ్…

ఇక ప్రాంతీయ భాషల్లోనే సమాచారం…

Travel Tips: భారతదేశంలో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, టికెట్ బుక్ చేసుకునే సమయంలో విమానయాన సంస్థలు వసూలు చేసే వివిధ రకాల అదనపు ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్యాసింజర్ ఫస్ట్' (ప్రయాణికుడికే మొదటి ప్రాధాన్యత) విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సీట్ల ఎంపిక, వెబ్ చెక్-ఇన్ మరియు క్యాన్సలేషన్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను విమానయాన సంస్థలు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగానే అందుబాటులో ఉంచాలి. గతంలో దాదాపు ప్రతి సీటుకు (మిడిల్ సీటుతో సహా) 'సీట్ సెలక్షన్ ఛార్జీ' పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. ఇకపై అటువంటి వెబ్ చెక్-ఇన్ ఉచ్చులో ప్రయాణికులు చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది సామాన్య ప్రయాణికుల జేబుకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పవచ్చు.

కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి మరో శుభవార్త ఏమిటంటే, ఒకే టికెట్ (PNR)పై బుక్ చేసుకున్న ప్రయాణికులను ఒకే దగ్గర కూర్చోబెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలు లేదా వృద్ధులతో ప్రయాణించేటప్పుడు వారు వేర్వేరు వరుసలలో కూర్చోవడం వల్ల కలిగే ఇబ్బందులను గమనించిన డీజీసీఏ, సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులందరికీ పక్కపక్కనే సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. దీనికోసం అదనపు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.

విమానం ఆలస్యమైనా లేదా రద్దయినా ప్రయాణికులకు ఉండే హక్కుల గురించి ఇకపై విమానాశ్రయాల్లో స్పష్టంగా ప్రదర్శించాలి. ముఖ్యంగా తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో డిజిటల్ బోర్డులు, మొబైల్ యాప్‌లలో ఈ సమాచారాన్ని ఉంచడం తప్పనిసరి. విమానం ఆలస్యమైతే భోజనం లేదా రీఫండ్ పొందే హక్కు ప్రయాణికుడికి ఉంటుంది. గతంలో ఈ నిబంధనలు క్లిష్టంగా ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని పారదర్శకంగా మార్చారు.
 

Spotlight

Read More →