AP Government: ఏపీలో వారికి ఎగిరిగంతేసే వార్త... ప్రభుత్వం సంచలన నిర్ణయం! Pawankalyan: పల్లెల ప్రగతికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. క్షేత్రస్థాయి సర్వేకు కీలక ఆదేశాలు! Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరోసారి భారత్‌కు పుతిన్.. అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ! Chandrababu: స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. PM Modi: మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి.. Kollu Ravindra: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ! మత్స్యకారుల సేవలో మంత్రి కొల్లు రవీంద్ర! TDP: పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు రాజకీయ డ్రామా.. ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు! Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు... ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆత్మీయత కనిపిస్తుంది.! Palla Srinivasa Rao: సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్ఫూర్తితో ఖర్చు తగ్గింపుకు పల్లా ముందడుగు! గ్రీన్ ఛానల్‌కు గుడ్‌బై! Greenfield Expressway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా... బెజవాడ టూ బెంగళూరు 8 గంటల్లోనే..!! AP Government: ఏపీలో వారికి ఎగిరిగంతేసే వార్త... ప్రభుత్వం సంచలన నిర్ణయం! Pawankalyan: పల్లెల ప్రగతికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. క్షేత్రస్థాయి సర్వేకు కీలక ఆదేశాలు! Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరోసారి భారత్‌కు పుతిన్.. అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ! Chandrababu: స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. PM Modi: మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి.. Kollu Ravindra: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ! మత్స్యకారుల సేవలో మంత్రి కొల్లు రవీంద్ర! TDP: పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు రాజకీయ డ్రామా.. ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు! Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు... ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆత్మీయత కనిపిస్తుంది.! Palla Srinivasa Rao: సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్ఫూర్తితో ఖర్చు తగ్గింపుకు పల్లా ముందడుగు! గ్రీన్ ఛానల్‌కు గుడ్‌బై! Greenfield Expressway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా... బెజవాడ టూ బెంగళూరు 8 గంటల్లోనే..!!

Palla Srinivasa Rao: సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్ఫూర్తితో ఖర్చు తగ్గింపుకు పల్లా ముందడుగు! గ్రీన్ ఛానల్‌కు గుడ్‌బై!

Palla Srinivasa Rao: విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “నా దేశం–నా బాధ్యత” అనే భావనతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపుకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన తన కాన్వాయ్‌ను కుదించుకున్నారు.

Published : 2026-05-19 19:36:00

కాన్వాయ్ కుదించిన పల్లా శ్రీనివాసరావు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం తిరిగి అప్పగింత.. 

భద్రతా సిబ్బందిని తగ్గించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా..

విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “నా దేశం–నా బాధ్యత” అనే భావనతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపుకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన తన కాన్వాయ్‌ను కుదించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచిస్తున్న బాధ్యతాయుత విధానాల స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తనకు వై-కేటగిరీ భద్రతలో భాగంగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇకపై వినియోగించబోనని నిర్ణయించిన పల్లా శ్రీనివాసరావు, ఆ వాహనాన్ని పోలీస్ శాఖకు తిరిగి అప్పగించారు. అలాగే భద్రతా వ్యవస్థను కూడా తగ్గిస్తూ 2+2 గన్‌మెన్ల స్థానంలో 1+1 భద్రతా సిబ్బంది సరిపోతారని సూచించారు. గ్రీన్ ఛానల్ సౌకర్యాలు, అధిక ఎస్కార్ట్ వాహనాలను ఉపయోగించకుండా తన సొంత వాహనంలోనే నియోజకవర్గ పర్యటనలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సూచించారని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ దుబారా ఖర్చులను తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు కూడా పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆ సూచనలను ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

“ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత” అని పల్లా పేర్కొన్నారు. “నా దేశం–నా బాధ్యత” అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని సీఎం ఇచ్చిన పిలుపు తనను ప్రభావితం చేసిందన్నారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహానాడుపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే మహానాడును ఈసారి సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ-డిజిటల్, ఆన్‌లైన్ వేదికల ద్వారా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఖర్చు తగ్గింపుతో పాటు ఆధునిక విధానాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Spotlight

Read More →