AP Government: ఏపీలో వారికి ఎగిరిగంతేసే వార్త... ప్రభుత్వం సంచలన నిర్ణయం! Pawankalyan: పల్లెల ప్రగతికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. క్షేత్రస్థాయి సర్వేకు కీలక ఆదేశాలు! Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరోసారి భారత్‌కు పుతిన్.. అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ! Chandrababu: స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. PM Modi: మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి.. Kollu Ravindra: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ! మత్స్యకారుల సేవలో మంత్రి కొల్లు రవీంద్ర! TDP: పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు రాజకీయ డ్రామా.. ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు! Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు... ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆత్మీయత కనిపిస్తుంది.! Palla Srinivasa Rao: సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్ఫూర్తితో ఖర్చు తగ్గింపుకు పల్లా ముందడుగు! గ్రీన్ ఛానల్‌కు గుడ్‌బై! Greenfield Expressway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా... బెజవాడ టూ బెంగళూరు 8 గంటల్లోనే..!! AP Government: ఏపీలో వారికి ఎగిరిగంతేసే వార్త... ప్రభుత్వం సంచలన నిర్ణయం! Pawankalyan: పల్లెల ప్రగతికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. క్షేత్రస్థాయి సర్వేకు కీలక ఆదేశాలు! Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరోసారి భారత్‌కు పుతిన్.. అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ! Chandrababu: స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. PM Modi: మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి.. Kollu Ravindra: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ! మత్స్యకారుల సేవలో మంత్రి కొల్లు రవీంద్ర! TDP: పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు రాజకీయ డ్రామా.. ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు! Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు... ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆత్మీయత కనిపిస్తుంది.! Palla Srinivasa Rao: సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్ఫూర్తితో ఖర్చు తగ్గింపుకు పల్లా ముందడుగు! గ్రీన్ ఛానల్‌కు గుడ్‌బై! Greenfield Expressway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా... బెజవాడ టూ బెంగళూరు 8 గంటల్లోనే..!!

Mahanadu: 20 కీలక తీర్మానాలతో టీడీపీ మహానాడు సన్నాహాలు! ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ కీలక భేటీ!

Mahanadu: టీడీపీ వార్షిక మహాసభ అయిన మహానాడుకు పార్టీ నేతలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. ఈసారి రెండు రోజుల పాటు జరిగే మహానాడులో దాదాపు 20 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టాలని పార్టీ యోచిస్తోంది.

Published : 2026-05-19 14:52:00

సూపర్ సిక్స్, యువత ప్రోత్సాహంపై మహానాడులో చర్చ..

అభివృద్ధి, ప్రతిపక్షాల వ్యవహారశైలిపై మహానాడులో తీర్మానాలు..

టీడీపీ వార్షిక మహాసభ అయిన మహానాడుకు పార్టీ నేతలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. ఈసారి రెండు రోజుల పాటు జరిగే మహానాడులో దాదాపు 20 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టాలని పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన కమిటీ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

మహానాడులో పార్టీ భావజాలం, ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా తీర్మానాలు తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు మరింత ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలపై ఉమ్మడి తీర్మానాలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల పురోగతి, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రానికి లభిస్తున్న సహకారం వంటి అంశాలపై కూడా మహానాడులో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా పడుతోందన్న దానిపైనా తీర్మానం తీసుకురావాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది.

ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల విధ్వంసక రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్న తీరు వంటి అంశాలపై కూడా మహానాడులో చర్చ జరగనుంది. చివరగా పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని ప్రతిబింబించేలా కీలక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు తీసుకురావాలని కూడా సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. మహానాడు తీర్మానాల కమిటీ రేపు మరోసారి సమావేశమై తుది రూపు ఇవ్వనుంది. అనంతరం తీర్మానాల అంశాలను పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అధిష్ఠానానికి సమర్పించనున్నారు.

ఈసారి మహానాడు ద్వారా పార్టీ భవిష్యత్ దిశ, ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలపై స్పష్టమైన సందేశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Spotlight

Read More →