Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన!

Chandrababu: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..!

Chandrababu Speech About SocialMedia: సామాజిక మాధ్యమాల కారణంగా 13 ఏళ్ల లోపు పిల్లలు నష్టపోకుండా నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Published : 2026-03-06 20:26:00
  • ఆత్మనిర్భర్- వికసిత్ భారత్ సంకల్పంపై చేసిన తీర్మానానికి శాసనసభ ఆమోదం..
     
  • ద్రవ్య వినిమయ బిల్లు సహా వివిధ అంశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం..

Chandrababu Speech About SocialMedia: సామాజిక మాధ్యమాల కారణంగా 13 ఏళ్ల లోపు పిల్లలు నష్టపోకుండా నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 90 రోజుల్లో విధి విధానాలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో విచ్చల విడితనంపై మంత్రి నారా లోకేష్ లోకేశ్ అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేశారని సీఎం అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. గత పాలకుల అస్తవ్యస్త విధానాల కారణంగా సంక్షోభంలో పడిన రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని ఆయన అన్నారు. 

వివిధ అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘గత పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. గడచిన 20 నెలల్లో కష్టాలు, సమస్యల్ని అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం వైపుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం. 15 రోజుల పాటు జరిగిన శాసనసభలో ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి చర్చలు జరిగాయి. భావితరాల భవిష్యత్ నిర్ణయించేలా ఈ సమావేశాల్లో చర్చలు, నిర్ణయాలు జరిగాయి. విభజన వల్ల, గత పాలకుల విధ్వంసం వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 94 శాతం మంది గెలవటం మా అందరిపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఎన్డీఏ పక్షాలన్నీ పూర్తి సఖ్యతతో ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రజలు ఓటేస్తేనే అధికారం..ప్రతిపక్షం
తీవ్ర అగమ్య గోచరంగా మారిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి నిర్మించేలా, గట్టెక్కించే బాధ్యత తీసుకున్నాం. రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టాం. ఎన్డీఏ పార్టీలన్నీ పూర్తి సమన్వయంతో వెళ్ల బట్టే అనుకున్నది సాధించగలిగాం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ  శాసన సభకు రాకుండా తప్పించుకు తిరుగుతోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వస్తామని చెప్పటం ఏమిటి.? ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారం, ప్రతిపక్ష హోదా వస్తాయి. ఈ నిబంధనలన్నీ రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండానే రాజకీయం చేస్తున్నారు. గత పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసం అయ్యాయి. అలాంటి పరిస్థితిని చక్కదిద్ది గాడిన పెట్టాం. 92 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిర్వీర్యం చేశారు. కేంద్రం నిధులు దారి మళ్లించారు. ఒక్క జల జీవన్ మిషన్‌లోనే రూ.85 వేల కోట్లు రావాల్సి ఉంటే కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ప్రతిపాదనలు పెట్టారు. ఆ పథకానికి 5 ఏళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే. మేం అధికారంలోకి వచ్చాక పథకం సమయాన్ని పొడిగించాలని కోరాం.  ఇంటింటికీ కుళాయి ఇచ్చేలా ఈ జల్ జీవన్ మిషన్‌ను ప్రణాళిక చేశాం. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను.’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

అధిక వడ్డీలకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు ప్రజాధనం దుర్వినియోగం
ప్రజలకు మెరుగైన సుపరిపాలన ఇచ్చేందుకు నిరంతరం పోరాటం చేశాం. గత పాలకులు ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎమ్మార్వో ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్క్యూట్ హౌస్ లాంటి ఆస్తులను తాకట్టు పెట్టారు. 12, 13 శాతంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రభుత్వ ఆర్ధిక వనరుల్ని దుర్వినియోగం చేశారు. రూ.43,298 కోట్ల విలువైన అప్పులకు ప్రభుత్వం రీ షెడ్యూలు చేయించాం. తద్వారా రూ.328 కోట్ల మేర ఆదా అవుతుంది. మరో రూ.1 లక్ష కోట్ల మేర అప్పులు కూడా రీ షెడ్యూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దీని వల్ల రూ.1,658 కోట్ల వెసులుబాటు వస్తుంది. ఈ నిధులతో మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన స్వార్ధంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లు ఇస్తాం. కేంద్ర సహకారంతో అమరావతి రాజధానిని ట్రాక్‌లో పెట్టాం. మూడేళ్లలో రాజధానికి ఓ రూపు వస్తుంది. వచ్చే సమావేశాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని వారి క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్ర నిధులతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. తొలిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తోంది’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

గత పాలనలో ట్రూ అప్.. కూటమి వచ్చాక ట్రూడౌన్
రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత ముఖ్యమైన అంశం. 20 నెలల్లో దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. హంద్రీనీవాకు రూ.3850 కోట్లు ఖర్చు చేసి కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. అనంతపురం లాంటి జిల్లాకు 55 టీఎంసీల నీటిని తీసుకువెళ్లాం. ప్రస్తుతం వేసవి వచ్చినా 628 టీఎంసీల నీరు వివిధ రిజర్వాయర్లలో నిల్వ ఉంది. సమర్ధ నీటి నిర్వహణతోనే ఇది సాధ్యమైంది. భూగర్భజలాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో 2.96 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగేలా వివిధ సంరక్షణా చర్యలు చేపట్టాం. భూగర్భ జలాలు పెరగటం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది. 

ఆ మేరకు వ్యయాన్ని ఆదా చేసుకున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. గత పాలకులు రూ.32 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం ప్రజలపై మోపారు. ట్రూ అప్ భారం వేస్తే చరిత్రలో తొలిసారి మేం ట్రూడౌన్ చేశాం. రూ.4420 కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ప్రజలపై మోపకుండా చర్యలు తీసుకున్నాం. పీఎం సూర్యఘర్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సౌర ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. యూనిట్ కొనుగోలు ధరను రూ. 5.19 నుంచి 4.80కు తగ్గించేలా చర్యలు చేపట్టాం.  అగ్రిటెక్‌తో వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. రూ.1 లక్ష కోట్లతో ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమ జిల్లాలను హార్టీ కల్చర్ హబ్‌గా పూర్వోదయ పథకం కింద అభివృద్ధి చేస్తాం’ అని సీఎం తెలిపారు.  

ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెన్‌ఫిట్ కార్డు
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే పది సూత్రాలతో 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పన చేశాం. ఆర్ధిక అసమానతలు తగ్గించేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. త్వరలోనే ప్రతీ కుటుంబానికి ఫ్యామిలి బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం కార్డును కూడా జారీ చేస్తాం. కేంద్రం, రాష్ట్రం అందించే పథకాలన్నిటినీ ఈ కార్డు ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం. రాష్ట్రంలో 25 నూతన పాలసీలు తీసుకురావటం ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటితో 23 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది.  పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీతో వ్యర్ధాల ద్వారా సంపద సృష్టిస్తున్నాం. ఇటీవలే వివాదాల పరిష్కారించేలా మధ్యవర్తిత్వంపై ఓ సదస్సు జరిగింది. మధ్యవర్తిత్వంపై దృష్టి పెట్టాలని సూచనలు వచ్చాయి. వివాదం పరిష్కారం అయితే రూ.10 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించాం. 

రాష్ట్రంలో అభివృద్ధికి అవరోధంగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేసి అవినీతిని కట్టడి చేశాం. జన్ విశ్వాస్ ద్వారా పాత చట్టాలను రద్దు చేస్తున్నాం అవసరమైన మార్పులు చేస్తున్నాం.  దీనికి సంబంధించి బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. గత పాలకులు ఐదేళ్లలో 884 కి.మీ సీసీ రోడ్లు, 234 కిలోమీటర్ల బీటీ రోడ్లు మాత్రమే వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో 4,998 కిలోమీటర్ల సీసీ రోడ్లను కేవలం 20 నెలల్లో పూర్తి చేయించేలా డిప్యూటీ సీఎం చర్యలు తీసుకున్నారు. పల్లె పండుగ, అడవి తల్లి బాట పేరిట గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గోశాలలు నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం కూడా జరుగుతోంది. 9 కోట్ల పని దినాలు కల్పించేలా కూడా ఉపముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.  నరేగా నుంచి వీబీజీ రామ్ జీ పథకానికి మార్పు జరిగింది. బడ్జెట్ తగ్గకుండా ఆ పథకాన్ని సమర్ధంగా వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

వైట్ కాలర్ క్రైమ్స్, సోషల్ సైకోలు అరాచకం
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్ తయారు చేసుకున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నాం.  మూడు ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నాం. సుప్రీంకోర్టు అనుమతితో కర్నూలుకు హైకోర్టు బెంచ్ సాధించుకునేలా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే అంశంపై సంకల్పం చేస్తాం. ఉగాదికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తాం. హెల్తీ, వెల్తీ హ్యాపీ సొసైటీగా ఏపీని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం. ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. వైట్ కాలర్ క్రైమ్స్, డిజిటల్ క్రైమ్స్, సైకోలు సోషల్ మీడియాలో అరాచకం చేస్తున్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాను. మావోయిస్టులను కట్టడి చేశాం, ఫాక్షనిజం రూపుమాపాం తద్వారా ప్రగతి సాధించాం’ అని సీఎం తెలిపారు.

పెళ్లికి వెళ్లి రప్పా రప్పా అంటూ దాడులు చేయడం ఎక్కడి సంస్కృతి?
‘రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా రప్పా రప్పా రాజకీయం వచ్చింది. ఓ రాజకీయ నాయకుడు పర్యటన చేస్తే రప్పా రప్పా అంటున్నారు. పెళ్లికి వెళ్ళి రప్పా రప్పా అంటూ దాడులు చేయాలా? భద్రత కోసం వెళ్లిన ఎస్ఐ గాయపడినా పట్టించుకోవటం లేదు. గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్‌లను పక్కన పెట్టుకుని తిరిగే నాయకుడు ఎక్కడైనా ఉంటారా? కటౌట్లకు పొట్టేళ్లతో రక్తాభిషేకం చేయటం ఏమిటి? ఇంత నేరుగా హింసను ప్రోత్సహిస్తారా?. పోస్టు మార్టానికి కారకులైన వారు పోస్టు మార్టానికే వెళ్తారు. రాష్ట్రంలో ఈ విధ్వంస యాత్రలు ఏమిటి, టైర్లు కింద మనుషుల్ని తొక్కించి నింద ప్రభుత్వంపై వేస్తారు. పరామర్శలకు వెళ్లి బలప్రదర్శనలు చేయటం ఏమిటి. 5 కిలోమీటర్ల దూరాన్ని 6-7 గంటల పాటు ప్రయాణిస్తారా ఎవరైనా.? ప్రతిపక్షంలో ఉండి పెట్టుబడులు రాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు  మేం అధికారంలోకి వస్తే పెట్టుబడులు రద్దు చేస్తామంటూ హెచ్చరికలు చేయటం ఏమిటి? దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా వ్యవహరించలేదు’ అని సీఎం వ్యాఖ్యానించారు

రెండు కొండలన్నప్పటి నుంచే కుట్రలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారు. ఇది తెలియకుండా జరిగిన వ్యవహారం కాదు. కుట్రతోనే కావాలని చేసిన నేరం. ఏడు కొండలను రెండు కొండలు చేసినప్పటి నుంచే ఈ కుట్ర కొనసాగుతోంది. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక కూడా అది కల్తీ నెయ్యి అని స్పష్టంగా తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా హిందూ మఠాలు, పీఠాలు ముక్త కంఠంతో వ్యతిరేకించినా కనీసం ఆ పార్టీ క్షమాపణ చెప్పలేదు. ప్రభువా క్షమించు అంటూ సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాయించుకున్న వ్యక్తి తిరుమల నైవేద్యం కల్తీ చేసి ఏడుకొండల స్వామికి క్షమాపణలు చెప్పరా? మత సామరస్యాన్ని గౌరవించకుండా.. క్షమాపణ చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నారు. శాసనమండలిలోనూ ఇదే అంశంపై గొడవ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా?’ అని సీఎం నిలదీశారు.

వ్యక్తిగత ప్రవర్తనతో చెడ్డ పేరు తేవొద్దు
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలతో మన మార్కెట్లు ప్రభావితం అవుతున్నాయి. ఎగుమతులు పడిపోవటంతో అరటి ధర తగ్గిపోయింది. చమురు ధరల వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. ప్రజాప్రతినిధులు-అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. కూటమిగా వెళ్లి ప్రజల మద్దతుతోనే అంతా గెలిచామని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి, పార్టీలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరుతున్నాను. 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి కొనసాగితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. కూటమిగా మనకు ఓ అజెండా ఉంది. 2029లోనూ మనం గెలిచి 2047 లక్ష్యాలను సాధించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Spotlight

Read More →