- తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలనాలు..
- సిట్ తుది అనుబంధ ఛార్జ్ షీట్‍లో కీలక విషయాలు..
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 'లడ్డూ కల్తీ' వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుపుతున్న సిట్ (SIT) అధికారులు తాజాగా దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్‌లో నివ్వెరపోయే విషయాలను వెల్లడించారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ, భక్తులకు కల్తీ ప్రసాదాన్ని పంపిణీ చేశారని సిట్ నిర్ధారించింది.
సిట్ నివేదిక ప్రకారం, గత ఐదేళ్లలో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని తేలింది. చుక్క పాలు కొనకుండా, వెన్న తీయకుండానే ఏకంగా 60 లక్షల కేజీల నెయ్యిని పుట్టించారని దర్యాప్తులో వెల్లడైంది. పామాయిల్‌కు ప్రమాదకరమైన సింథటిక్ రసాయనాలను కలిపి, దానికి నెయ్యి రంగు, వాసన వచ్చేలా మార్చారు. ఈ కల్తీ నెయ్యిలో బీటా కెరోటిన్, అసిటిక్ యాసిడ్ ఈస్టర్, మరియు లాక్టిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు మరియు కెమికల్స్‌తో చేసిన ఈ మిశ్రమంతోనే దాదాపు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు ప్రసాదంగా ఇచ్చారని సిట్ పేర్కొంది.
ఈ మహా పాపం వెనుక భారీ ఆర్థిక కుంభకోణం కూడా దాగి ఉందని సిట్ అధికారులు గుర్తించారు. సుమారు 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యిని సరఫరా చేసి, ప్రభుత్వ ఖజానా నుండి రూ. 234 కోట్లను వైసీపీ బ్యాచ్ దోచుకున్నట్లు ఛార్జ్ షీట్‌లో వివరించారు. నాణ్యత లేని వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేస్తూ, భక్తుల నమ్మకంతో వ్యాపారం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఇంతటి ఘోరానికి ఒడిగట్టినందుకే ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రతిష్టను అన్ని విధాలా దిగజార్చారని సిట్ తన నివేదికలో పరోక్షంగా ప్రస్తావించింది. అన్యమతస్థులు తిరుమలలో సంతకం చేయాల్సిన డిక్లరేషన్‌పై జగన్ ఏ రోజూ సంతకం చేయలేదని, సీఎం హోదాలో ఉండి కూడా ఐదేళ్లలో ఒక్కసారి కూడా పట్టు వస్త్రాలు సమర్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి పట్ల నమ్మకం లేని వారు పీఠంపై కూర్చొని ఇలాంటి అపవిత్ర పనులకు పాల్పడటం క్షమించరాని నేరమని భక్తులు మండిపడుతున్నారు. ప్రస్తుతం సీబీఐ మరియు సిట్ అధికారులు సంయుక్తంగా ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతున్నారు.
తిరుమల లడ్డూ వివాదంలో వెలుగు చూస్తున్న ఈ అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల హృదయాలను గాయపరుస్తున్నాయి. దోషులకు కఠిన శిక్ష పడే వరకు ఈ పోరాటం ఆగదని భక్తులు కోరుకుంటున్నారు.