TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!! Amaravati E6Road: అమరావతిలో అద్భుతం... తుది దశకు చేరిన E6 రోడ్డు! ఈ రోడ్డు వైపే CBN గారి ఇల్లు.... Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం! TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!! Amaravati E6Road: అమరావతిలో అద్భుతం... తుది దశకు చేరిన E6 రోడ్డు! ఈ రోడ్డు వైపే CBN గారి ఇల్లు.... Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం!

Amaravathi: రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం.. కీలక అంశాలపై సీఎం సమీక్ష!

Amaravathi: రాష్ట్ర సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు సమావేశం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక విభాగాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

Published : 2026-05-08 09:36:00

8 విభాగాలపై నేడు కలెక్టర్లతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

సీఎం చంద్రబాబుకు ప్రజంటేషన్ ఇవ్వనున్న అధికారులు..

అమరావతి: రాష్ట్ర సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు సమావేశం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక విభాగాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఈరోజు మొత్తం 8 ప్రధాన విభాగాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా “స్వర్ణాంధ్ర విజన్ 2024”లో భాగంగా డీప్ టెక్, సూపర్ సిక్స్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రెవెన్యూ, ఆదాయ వనరుల పెంపు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ అంశాలపై అధికారులు సమగ్ర ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.

మధ్యాహ్నం తర్వాత న్యాయ విభాగం, శాంతి భద్రతలపై సమీక్ష కొనసాగనుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించనున్నారు.

సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో కలిసి ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో చర్చించిన అన్ని అంశాలను సమీక్షించి, అధికారులకు మరియు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ఈ సమావేశం కీలక వేదికగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

Spotlight

Read More →