TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!! Amaravati E6Road: అమరావతిలో అద్భుతం... తుది దశకు చేరిన E6 రోడ్డు! ఈ రోడ్డు వైపే CBN గారి ఇల్లు.... Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం! TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!! Amaravati E6Road: అమరావతిలో అద్భుతం... తుది దశకు చేరిన E6 రోడ్డు! ఈ రోడ్డు వైపే CBN గారి ఇల్లు.... Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం!

Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం!

Railway Zone: ఆంధ్రప్రదేశ్ రైల్వేజోన్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం రైల్వేజోన్‌ను ప్రకటించిందని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిందని ఎంపీ భరత్ విమర్శించారు.

Published : 2026-05-08 10:51:00

2019లో టీడీపీ హయాంలో కేంద్రం రైల్వేజోన్ ప్రకటించింది..

జోనల్ ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని కేంద్రం కోరినా పట్టించుకోలేదు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైల్వేజోన్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం రైల్వేజోన్‌ను ప్రకటించిందని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిందని ఎంపీ భరత్ విమర్శించారు.

రైల్వేజోన్ ఏర్పాటు కోసం అవసరమైన జోనల్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని కేంద్రం పలుమార్లు కోరినా, అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో ఈ కీలక ప్రాజెక్టును గాలికొదిలేసి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రైల్వేజోన్ విషయాన్ని గుర్తు చేసుకోవడం వైసీపీ వైఖరిని బయటపెడుతుందని విమర్శించారు.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఊతమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలు ముందుకు సాగుతున్నాయని, సిరిపురం జంక్షన్ డెక్ ఆఫీస్‌లో తాత్కాలిక జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జూన్ 1 నుంచి ఈ జీఎం కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. రైల్వేజోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →