Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా!

Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి...

Farmers: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అయితే, అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Published : 2026-05-25 16:58:00

Politics- బీజేపీ బస్సు యాత్రలు కేవలం రాజకీయ డ్రామా…

కేంద్రానిది రైతు వ్యతిరేక వైఖరి.. అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం: మంత్రి పొన్నం

దమ్ముంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. బీజేపీ నేతలకు పొన్నం ప్రభాకర్ సవాల్…

Farmers: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు చేపట్టిన 'రైతు ఘోస – బీజేపీ భరోసా' బస్సు యాత్రలను ఆయన కేవలం ఒక రాజకీయ నాటకమని కొట్టిపారేశారు. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు, రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇటువంటి యాత్రలు చేస్తోందని దుయ్యబట్టారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే, రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలను తగ్గించి కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.

పెట్రోల్, డీజిల్ ధరల విపరీతమైన పెరుగుదల వల్ల ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు భారీగా పెరిగి రైతులపై సాగు వ్యయం భారంగా మారిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరల పెరుగుదలపై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ మరియు లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపిస్తోందని, మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరినా నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అయితే, అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వెనకడుగు వేయకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు జరుపుతోందని ఆయన వివరించారు.

రైతుల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విజయవంతంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని, నేరుగా 8.50 లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 8,749 కోట్ల కనీస మద్దతు ధరను జమ చేసిందని వివరించారు. ధాన్యం నిల్వలకు ఎక్కడా కొరత లేకుండా ముందస్తుగా 21 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామని, కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న మిగిలిన ధాన్యాన్ని కూడా అంతే వేగంగా సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, వృద్ధ రైతులకు పెన్షన్లు ఇస్తామని చెప్పిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పూర్తిగా తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా పారిశ్రామికవేత్తల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, అన్నదాతలకు నయాపైసా రుణమాఫీ చేయకపోవడం వారి వివక్షకు నిదర్శనమన్నారు. గతంలో నల్ల చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా 700 మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన బీజేపీకి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని, ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేసేలా రైతులు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Spotlight

Read More →