Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Amaravati Updates: అమరావతిలో రికార్డు వేగం: వారం రోజుల్లోనే మారిన ఐకానిక్ కట్టడాల రూపురేఖలు! Minister Narayana: నెల్లూరులో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శ్రీకారం.. రూ.14 వేల కోట్లతో నగర రూపురేఖలు మారుస్తామన్న మంత్రి! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Amaravati Updates: అమరావతిలో రికార్డు వేగం: వారం రోజుల్లోనే మారిన ఐకానిక్ కట్టడాల రూపురేఖలు! Minister Narayana: నెల్లూరులో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శ్రీకారం.. రూ.14 వేల కోట్లతో నగర రూపురేఖలు మారుస్తామన్న మంత్రి!

Tirupati: తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు.. భూమన వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం!

Tirupati: తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు.

Published : 2026-05-24 11:18:12

పోలీసుల తీరుపై హిందు సంఘాల ఆగ్రహం..

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన వ్యాఖ్యలు..

తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో శిల్పారామం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భూమన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే భూమనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

భూమన ఇంటి వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన హిందూ సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని హిందూ సంఘాల నేతలు పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి హిందువు బాధ్యత. అలాంటి పవిత్ర స్థలంపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం” అంటూ పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం శిల్పారామం పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

Spotlight

Read More →