Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా! New Railway Lines: ఏపీకి కేంద్రం తీపికబురు! రూ.4,758 కోట్లతో కొత్త రైల్వే లైన్లు.. మూడు రాష్ట్రాలకు భారీ ప్రయోజనం! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా! New Railway Lines: ఏపీకి కేంద్రం తీపికబురు! రూ.4,758 కోట్లతో కొత్త రైల్వే లైన్లు.. మూడు రాష్ట్రాలకు భారీ ప్రయోజనం!

Minister Savitha: అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవిత సవాల్!

Minister Savitha: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవిత వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు.

Published : 2026-05-05 20:14:00

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం..

మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు..

గోరంట్ల/శ్రీసత్యసాయి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవిత వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. “ప్లేస్ మీరు చెప్పినా… నేను చెప్పినా… చర్చకు రెడీ” అంటూ ఆమె ధీమాగా పేర్కొన్నారు.

గోరంట్ల మండలంలో కరావులపల్లి నుంచి కరావులపల్లి తండా వరకు రూ.60 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును, అలాగే బూచేపల్లి నుంచి కొత్తపల్లి వరకు రూ.2.47 కోట్లతో నిర్మించిన మరో బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, రహదారులే అభివృద్ధికి అసలు పునాది అని స్పష్టం చేశారు.

“గత పాలకులు మీటరు రోడ్డు కూడా వేయలేకపోయారు. ఇప్పుడు రోడ్లు లేని గ్రామాలకు బీటీ, సీసీ రోడ్లు వేస్తున్నాం” అని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.

గత ఎన్నికల సమయంలో బూచేపల్లి గ్రామస్తులు రహదారి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో “రోడ్డేసిన తరువాతే వస్తాను” అని చెప్పానని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని రూ.2.50 కోట్లతో రోడ్డు నిర్మించి ఈరోజు గ్రామానికి వచ్చానని చెప్పారు. బూచేపల్లి పంచాయతీలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. గ్రామ ప్రజలు ఇచ్చిన మద్దతుకు రుణపడి ఉంటానని, అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం 23 నెలల్లో చేసిన అభివృద్ధిపై పెనుకొండ, పులివెందుల, ధర్మవరంలాంటి ప్రాంతాలపై చర్చకు సిద్ధమని మంత్రి సవిత పేర్కొన్నారు. “మీరు ప్లేస్ చెప్పాలా… లేక నేను చెప్పాలా?” అంటూ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. గతంలో పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి లేదని, కనీస రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదని విమర్శించారు.

విలేకరులతో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం ఏమి చేయలేదని మంత్రి మండిపడ్డారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. “ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక సాగునీటి కాలువ పూర్తి చేశారా?” అని ప్రశ్నించారు. జగన్ హయాంలో జరిగిన ఒప్పందాల వివరాలు వెల్లడించాలని మంత్రి నారా లోకేష్ అడిగినా, వైసీపీ నేతలు స్పందించడం లేదని అన్నారు. “జగన్‌ది చోరీ క్రెడిట్… మాకు ఆ క్రెడిట్ అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు.

పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమతో వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే కియా, బెల్ వంటి పరిశ్రమలు వచ్చినట్లు గుర్తుచేశారు. తాజా పెట్టుబడులతో సత్యసాయి జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడి కృషిని ప్రశంసిస్తూ, జిల్లాలో భారీ పరిశ్రమల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రి సవితకు బూచేపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spotlight

Read More →