Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా! Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా!

Nimmala Ramanaidu: వెలిగొండ టన్నెల్ పనులపై మంత్రి నిమ్మల రాత్రి పర్యటన.. కార్మికులతో కలిసి భోజనం!

Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించేందుకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రివేళే టన్నెల్‌లోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు.

Published : 2026-05-06 10:12:00

టన్నెల్-2 లో 12 వ కి. మీ దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్ దగ్గరకు వెళ్లిన మంత్రి నిమ్మల..

టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నెల్ నుండి బయటికి రాదు..

డోర్నాల (మార్కాపురం జిల్లా): వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించేందుకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రివేళే టన్నెల్‌లోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. టన్నెల్‌లో దాదాపు 19 కిలోమీటర్ల మేర ప్రయాణించి, అక్కడ జరుగుతున్న లైనింగ్, బెంచింగ్ పనులను సమీక్షించారు.

టన్నెల్‌లో 5 గ్యాంట్రీలతో కొనసాగుతున్న పనుల స్థితిని తెలుసుకున్న మంత్రి, అక్కడ పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్) వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల విమర్శలు చేశారు. టీబీఎంను తొలగించేందుకు అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అది అలాగే ఉండిపోతే టన్నెల్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదన్నారు. ఇంకా రూ.3 వేల కోట్ల పనులు మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారని, దీని వల్ల ప్రకాశం జిల్లా రైతులు మోసపోయారని ఆరోపించారు.

పర్యటనలో భాగంగా మంత్రి నిమ్మల టన్నెల్-2లోనే అధికారులు, కార్మికులతో కలిసి భోజనం చేసి వారితో మమేకమయ్యారు. పనుల మధ్యలో కూడా కార్మికుల కష్టాలను అర్థం చేసుకుంటూ వారికి ధైర్యం చెప్పారు.

అలాగే, టన్నెల్‌లో కొన్ని చోట్ల సాఫ్ట్ రాక్ ఉండటం వల్ల కొండ రాళ్లు ఊడి పడే ప్రమాదం ఉందని గుర్తించి, అలాంటి ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ పనులు కొనసాగించాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు మంత్రి సూచించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగంగా, సురక్షితంగా పూర్తి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.

Spotlight

Read More →