Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు.. Ram Mohan Naidu: విమానాల లీజింగ్‌లో భారత్ కొత్త కేంద్రం.. గిఫ్ట్ సిటీపై ప్రపంచ దృష్టి! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు! stock markets: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! 500 పాయింట్లకు పైగా.. Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!! Beer Price: మందుబాబులకు 'షాక్': పెరగనున్న బీర్ ధరలు.. బాటిళ్లకు మార్కెట్లో తీవ్ర కొరత! Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! D-Mart: డి-మార్ట్ సంచలన ఆఫర్లు: 390 ఉత్పత్తులపై 50% తగ్గింపు.. సగం ధరకే అన్నీ! SBI Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్: పెరిగిన ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే! Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు.. Ram Mohan Naidu: విమానాల లీజింగ్‌లో భారత్ కొత్త కేంద్రం.. గిఫ్ట్ సిటీపై ప్రపంచ దృష్టి! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు! stock markets: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! 500 పాయింట్లకు పైగా.. Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!! Beer Price: మందుబాబులకు 'షాక్': పెరగనున్న బీర్ ధరలు.. బాటిళ్లకు మార్కెట్లో తీవ్ర కొరత! Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! D-Mart: డి-మార్ట్ సంచలన ఆఫర్లు: 390 ఉత్పత్తులపై 50% తగ్గింపు.. సగం ధరకే అన్నీ! SBI Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్: పెరిగిన ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!

India-EU: ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్‌కు భారత్–ఈయూ రూ.169 కోట్ల సంయుక్త కార్యక్రమం!

India-EU: భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఈవీ బ్యాటరీల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కీలకమైన సంయుక్త కార్యక్రమం ప్రారంభమైంది. ఇండియా–ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ వర్కింగ్ గ్రూప్-2 పరిధిలో రూ.169 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 2026-05-06 14:58:00

గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్–ఈయూ కీలక అడుగు..

ఈవీ మార్కెట్‌కు మద్దతుగా రీసైక్లింగ్ వ్యవస్థ బలోపేతం..

భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఈవీ బ్యాటరీల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కీలకమైన సంయుక్త కార్యక్రమం ప్రారంభమైంది. ఇండియా–ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ వర్కింగ్ గ్రూప్-2 పరిధిలో రూ.169 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. దేశంలో ఈవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, బలమైన దేశీయ రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పరచడం వనరుల భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత అవసరమని ఆయన వివరించారు.

భారత్‌లో యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్ మాట్లాడుతూ, గ్రీన్ ట్రాన్సిషన్‌లో బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పరిశోధన దశలో ఉన్న ఆవిష్కరణలను వాస్తవ జీవితంలో అమలు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా భారత్, ఈయూ కలిసి ఈవీ బ్యాటరీల రీసైక్లింగ్‌పై మూడో సంయుక్త ప్రపోజల్స్ కాల్‌ను కూడా ప్రకటించాయి. ఈ పిలుపు ద్వారా కీలక ముడి పదార్థాల భద్రత, సర్క్యులర్ ఎకానమీకి వేగవంతమైన మార్పు, అలాగే భారత్–ఈయూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు యూరోపియన్ యూనియన్ “హొరైజన్ యూరప్” ప్రోగ్రామ్ ద్వారా నిధులు సమకూర్చనుండగా, భారత భాగాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుంది.

ఈ కార్యక్రమంలో అధునాతన రీసైక్లింగ్ సాంకేతికతల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా అధిక సామర్థ్యంతో పదార్థాల పునరుద్ధరణ, సురక్షితమైన డిజిటల్ కలెక్షన్ వ్యవస్థలు, కొత్త విధానాలపై పైలట్ స్థాయి పరీక్షలు చేపట్టనున్నారు.

అదే సమయంలో భారత్‌లో సంయుక్తంగా ఇండియా–ఈయూ పైలట్ లైన్‌ను ఏర్పాటు చేసి, పరిశోధనలు వాస్తవ స్థాయిలో అమలు అయ్యేలా చూడనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశోధకులు, పరిశ్రమలు, స్టార్టప్‌లు కలిసి పనిచేసి భవిష్యత్‌కు అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ సంయుక్త కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, ఈవీ రంగంలో భారత్ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Spotlight

Read More →