Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

Braking News Updates: నేటి ముఖ్యాంశాలు.. పార్లమెంట్ వేదికగా రాజకీయ రచ్చ.. ఏపీలో ఈడీ దూకుడు.. భయం గుప్పిట్లో ఏజెన్సీ!

Telugu News Updates: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయగా, అడ్డతీగల మండలంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది తాజా రాజకీయ వార్తలు..

Published : 2026-03-09 16:24:00

Telugu News Updates: దేశ రాజధాని ఢిల్లీ నుంచి పీలోని మారుమూల గ్రామాల వరకు నేడు రాజకీయ, పరిపాలనాపరమైన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా మారుతుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తు సంస్థల సోదాలు కలకలం రేపుతున్నాయి. వీటికి తోడు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

 పార్లమెంట్‌లో స్పీకర్‌పై అవిశ్వాసం.. పతాక స్థాయికి చేరిన రాజకీయం

పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, తొలిరోజే సభలో రాజకీయ వేడి రాజుకుంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ సభ్యులు మహ్మద్ జావేద్, సురేష్, మల్లు రవి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్పీకర్ అనుమతించారు. ఈ పరిణామం భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవనుంది. తీర్మానంపై చర్చ ముగిసే వరకు సభా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పీకర్ నిర్ణయించుకోవడం గమనార్హం. ఆయన స్థానంలో ప్యానెల్ స్పీకర్లు సభను నడిపించే అవకాశం ఉంది.

ఎంపీలకు 3-లైన్ విప్.. సభలో గెలుపెవరిది?

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. ఈరోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ  కాంగ్రెస్ పార్టీలు 'త్రీ లైన్ విప్' జారీ చేశాయి. సభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో ఒక్క సభ్యుడు కూడా గైర్హాజరు కాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ మూడు రోజులు పార్లమెంట్ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

 ఏపీ లిక్కర్ స్కామ్: రంగంలోకి దిగిన ఈడీ.. ముగ్గురు కీలక వ్యక్తులకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దూకుడును పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని, వచ్చేటప్పుడు గత కొన్ని ఏళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పాన్ కార్డు వివరాలు  తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను వెంట తీసుకురావాలని ఈడీ స్పష్టం చేసింది. ఈ విచారణతో ఈ స్కామ్‌లో వెనుక ఉన్న మరికొందరు పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఏజెన్సీలో పులి పంజా.. అడ్డతీగలలో భయం భయం!

ఒకవైపు రాజకీయ సెగలు ఉంటే, మరోవైపు అటవీ ప్రాంత ప్రజలు వన్యప్రాణుల భయంతో వణికిపోతున్నారు. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు పులి అడుగుజాడలను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప గ్రామ ప్రజలు ఒంటరిగా బయటకు రావద్దని, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఒకవైపు ఉంటే, ఈడీ విచారణ ఎటు దారితీస్తుందో అన్న భయం ఏపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచారం ఎప్పుడు ఏ ప్రమాదానికి దారితీస్తుందోనని అటవీ శాఖ రేయింబవళ్లు పహారా కాస్తోంది. మొత్తానికి నేటి వార్తల్లో ఇవి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలుగా నిలిచాయి.

Spotlight

Read More →