Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా..

AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

AP Govt: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ కు చెందిన బద్దల మల్లెకొండయ్య నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమతో పాటు మరో ఏడు పేద కుటుంబాల వారిమి కలిసి 1998లో గోపవరం మండలంలోని సర్వే నంబరు 857/3Dలో నివేశన స్థలాలను కొనుగోలు చేశాం.

Published : 2026-04-13 20:27:00
  • రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. టీడీపీ కార్యకర్తవు మమ్మల్ని ఏం చేయలేవంటూ వేధింపులు.. 
     
  • Politics: అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..

Mangalagiri AP Govt: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ కు చెందిన బద్దల మల్లెకొండయ్య నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమతో పాటు మరో ఏడు పేద కుటుంబాల వారిమి కలిసి 1998లో గోపవరం మండలంలోని సర్వే నంబరు 857/3Dలో నివేశన స్థలాలను కొనుగోలు చేశాం. తన పేరున డాక్యుమెంట్ నంబర్ 2150/98 (తేదీ: 16/10/1998) ద్వారా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. గత ప్రభుత్వ కాలంలో స్థానిక వైసీపీ నాయకులు రాచపూటి సాయి, జయరాం నాయుడు సదరు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఆక్రమించుకున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందకు తమని భయభ్రాంతులకు గురిచేశారు. అప్పట్లో అధికారులను కలిసి మొరపెట్టుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు తమ మొరను పట్టించుకోలేదు. ఫలితంగా బలహీన వర్గాలకు చెందిన తమ ఎనిమిది కుటుంబాలకు దక్కాల్సిన న్యాయమైన భూమి హక్కులను కోల్పోయాం. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.

సత్యసాయి జిల్లా నల్లమాడకు చెందిన రవీంద్రనాధ గుప్తా గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. కదిరి-పుట్టపర్తి ప్రధాన రహదారికి ఉత్తర దిశలో ఉన్న తన పూర్వీకుల ఆస్తి సర్వే నంబరు 270-1 (విస్తీర్ణం 8.01 ఎకరాలు) లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాను. గతంలో ఉన్న పాత స్నానాల గది, టాయిలెట్ స్థానంలో కొత్తగా నిర్మాణం చేపడుతుండగా.. తేదీ 15-03-2025 నాడు సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో స్థానిక వైకాపా నాయకులు, వారి అనుచరులు జేసీబీలతో అక్రమంగా ప్రవేశించారు. నిర్మాణంలో ఉన్న పునాదులను జేసీబీలతో పెకలించి వేస్తుండగా తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య, కుమారుడు అడ్డుకోబోయారు. ఈ క్రమంలో నిందితులు వారిపై దాడి చేసి, పక్కకు తోసివేసి ప్రాణహాని తలపెడతామని బెదిరించారు. టి.డి. రఘునాధ రెడ్డి, టి.డి. కేశవ రెడ్డి, ముద్దిరెడ్డి సోమిరెడ్డి, రవిచంద్రా రెడ్డి, కొక్కంటి మంజునాధ రెడ్డి జేసీబీ ఓనర్ ఇతరులు ఈ అక్రమ కూల్చివేతకు పాల్పడ్డారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన ప్రియ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 2025లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాపట్ల జిల్లా కర్లపాలెం నివాసి పిట్టు ఉమా మహేశ్వర రెడ్డి పరిచయమయ్యాడు. తనకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నాడు. అంతేకాకుండా వ్యాపారం పేరుతో తన వద్ద నుండి రూ. 7 లక్షల నగదు తీసుకున్నాడు. నిందితుడికి అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకుని తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా బాపట్ల రమ్మని పిలిపించాడు. బాపట్ల బాదాం పాలు సెంటర్ వద్దకు తన కుమార్తెతో కలిసి వెళ్లగా, తాను కారు దిగిన సమయంలో నిందితుడు కారులో ఉన్న తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌పై చేయి వేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అకృత్యంపై ప్రశ్నించిన తనని నిందితుడి మావయ్య, కర్లపాలెం జెడ్పీటీసీ వేణు గోపాల్ రెడ్డి రాజకీయ పలుకుబడితో బెదిరించారు. చంపేస్తామంటూ కులం పేరుతో దూషిస్తూ రౌడీలతో దాడులు చేయిస్తామని ప్రాణహాని తలపెట్టారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

పల్నాడు జిల్లా మాచవరం మండలం తిరకాపాలెం గ్రామానికి చెందిన పెద్ద హుసేన్ వలి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన పూర్వీకుల నుండి సంక్రమించిన 9 ఎకరాల 10 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించిన ఖాతా నంబరు 836. సర్వే నెం. 247/33 (.05 ఎకరాలు, 247/34 1.51 ఎకరాలు, 247/35-2A 1.16 ఎకరాలు, 247/38-2 1.25 ఎకరాలు. గత ప్రభుత్వ కాలంలో మాచవరం అప్పటి తహసీల్దార్ ఎన్నయ్య గారు, సర్వేయర్ వెంకటరావు గారు తమ అధికారాన్ని దుర్వనియోగం చేసి, తన పేరిట ఉన్న రికార్డులను అక్రమంగా మార్చివేశారు. తనకు ఉన్న ఖాతా నంబరు 836ను తొలగించి, తమకు అనుకూలమైన వ్యక్తి పేరిట కొత్త ఖాతాను సృష్టించారు. అధికారులను ప్రశ్నించగా "నువ్వు టీడీపీ కార్యకర్తవు.. మమ్మల్ని ఏమీ చేయలేవు" అని హేళన చేస్తూ బెదిరింపులకు గురిచేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు చెందిన కడలి ధనలక్ష్మి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో తన భర్త పద్మరాజు గారు 2012లో రిజిస్టర్ నెం. 4374/2012 ద్వారా 2.00 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 1.06 ఎకరాలను 2015లో విక్రయించగా, మిగిలిన 0.94 ఎకరాల భూమి తమ స్వాధీనంలో ఉంది. మిగిలిన స్థలాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా ఇంతేరు గ్రామానికి చెందిన కానూరి పెద్దిరాజు, గురజాల రాము, గురజాల శ్రీరాములు, చింతా సంపతరావు, కొల్లాటి శ్రీనివాసరావు, చింతా ఏసుబాబు, చింతా నాగరాజు అనే వ్యక్తులు 2019 నుండి అడ్డుపడుతున్నారు. ఈ విషయంపై 2019 నుండి జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు ఫిర్యాదు చేశాను. ఇటీవల తమ భూమి వద్దకు వెళ్లగా తనపై బూతులు తిడుతూ భౌతిక దాడికి దిగారు. చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా గాయపరిచారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం చండ్రమాకుల పల్లి గ్రామానికి చెందిన  దేవరింటి రవి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెం. 100/2 లో తన పేరున 1.68 ఎకరాలు (ఖాతా నెం: 815), దేవరింటి కవిత పేరున 1.00 ఎకరం (ఖాతా నెం: 5025) పట్టా భూమి ఉంది. ఇందులో తాము బోరు వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. తమ భూమి పక్కనే పొలం ఉన్న ఆలకం వెంకటస్వామి, ఆలకం నరసింహులు వారి కుటుంబ సభ్యులు కలిసి తమ పొలంలోకి వెళ్లకుండా దారులన్నీ మూసివేసి కంచె వేశారు. సదరు వ్యక్తులు సర్వే నెంబర్ 100/1 లోని 1.80 ఎకరాలు, సర్వే నెంబర్ 559 లోని 1.50 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. కనీసం ఆ ప్రభుత్వ భూమి గుండా కూడా తమను తమ పొలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. అధికారులను ఆశ్రయించగా, వారు దారి చూపించేందుకు జెసిబితో వచ్చినప్పుడు.. ఆక్రమణదారులు జెసిబికి అడ్డుగా పడుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. తమకు అనుకూలం కాని మరో దారి గుండా వెళ్లమని వేధిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం బావికాడపల్లె గ్రామానికి చెందిన  సావిత్రమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన కొమ్మి కృష్ణయ్య నాయుడు గారు 40 ఏళ్ల క్రితం చనిపోయారు. అప్పట్లో గ్రామ కరణం గారు తమ గ్రామంలోని సర్వే నంబరు 454ను సబ్ డివిజన్ చేసి, తనకు 2.00 ఎకరాల పొలానికి పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారు. అప్పటి నుండి ఆ భూమిని సాగు చేసుకుంటున్నాను. గత రెండు మూడేళ్లుగా అనారోగ్యం వల్ల, నీరు లేక పంట వేయలేకపోయాను. తనకు అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల ఆ భూమిని ఆన్‌లైన్ చేయించుకోవాలనే విషయం తెలియలేదు. ఇటీవల ఆన్‌లైన్ కోసం తహసీల్దార్ గారిని సంప్రదించగా మీ భూమి వివరాలు అడంగల్‌లో మాత్రమే ఉన్నాయి, డి-కెట్ రిజిస్టర్‌లో లేవు అని చెబుతూ ఆన్‌లైన్ చేయడానికి నిరాకరిస్తున్నారు. కావున తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం, మీదజంగంపల్లికి గంధం రవిబాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. రెడ్డివారిపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 817, 36, 37/11, 37/12 లలో తనకు పిత్రార్జితంగా వచ్చిన 4 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తన భూమిపై, తన దాయాదులైన నారప్ప, హరిబాబు, బాలాజీ, రమేష్, గంధం రామానాయుడు, ఏనుగొండ సుబ్రమణ్యం కన్నేశారు. తన పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో నిందితులు గుంపుగా వచ్చి విచక్షణారహితంగా దాడి చేసి రక్తగాయాలు చేశారు. కష్టపడి సాగు చేసిన పంటలోకి పశువులను తోలి పంటను సర్వనాశనం చేస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఈ దౌర్జన్యాలపై ఎన్నిసార్లు పోలీసులను ఆశ్రయించినా, నిందితుల రాజకీయ ప్రభావం వల్ల ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అచ్చంపల్లె గ్రామానికి  చెందిన పెద్దిరాజు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 19.08.2024న మార్కాపురానికి చెందిన ముద్దన హరికృష్ణ వద్ద తనతో పాటు మరో ముగ్గురు కలిసి రూ. 37,00,000/- అప్పుగా తీసుకున్నాం. ఇందుకు గాను నెమిలికంట్లలో 70 సెంట్లు, కర్లపూడిలో 30 సెంట్లు భూమిని 2 రూపాయల వడ్డీకి ఒప్పందం కుదుర్చుకుని తామే రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించి తనఖా పెట్టాం. ఒప్పందం ప్రకారం రెండు నెలల తర్వాత రూ. 20,00,000 అసలు, రూ. 1,00,000 వడ్డీ.. మొత్తం రూ. 21,00,000 చెల్లించాం. అప్పుడు 30 సెంట్ల భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత లెక్కల ప్రకారం మిగిలిన అసలు రూ. 17,00,000, వడ్డీ రూ. 2,72,000 కలిపి మొత్తం రూ. 19,72,000 చెల్లించాల్సి ఉంది. అయితే అప్పు ఇచ్చిన వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి తమను భయభ్రాంతులకు గురిచేసి బ్లాక్‌మెయిల్ చేస్తూ సక్రమంగా చెల్లించాల్సిన మొత్తం కంటే అదనంగా రూ. 13,00,000/- బలవంతంగా లాక్కున్నారు. ఈ అన్యాయంపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ తమకు సరైన న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన రవి శంకర్ బాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన తండ్రి బండారు తిరుపతయ్య గారు తన స్వార్జితంతో సంపాదించిన భూమిని తన తన పేరిట 2015లో గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. సర్వే నెం. 77-3A1B లో 0.9800 ఎకరాలు, సర్వే నెం. 77-3A3 లో 0.6900 ఎకరాలు. ఈ భూమి 27-07-2015న తన పేరిట అధికారికంగా రిజిస్ట్రేషన్ అయ్యింది. అయితే గత 20 ఏళ్లుగా గుంటూరు పట్టణంలో నివసిస్తూ వ్యాపారం చేసుకుంటున్నాను. క్రోసూరులోని తన భూమిని 2015 నుండి ఇతరులకు కౌలుకు ఇస్తూ సాగు చేయిస్తున్నాను. అయితే గత 4-5 నెలలుగా జాస్తి హరిబాబు అనే వ్యక్తి తన భూమిలోకి అక్రమంగా చొరబడి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. భూమిలోకి ఎందుకు ప్రవేశించావని ప్రశ్నించినందుకు, సదరు వ్యక్తి  తనను కొట్టడానికి ప్రయత్నించడమే కాకుండా, తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని తీవ్రంగా బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →