Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు!

Butchaiah Chowdary: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు.. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు!

Butchaiah Chowdhary: రాజమహేంద్రవరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 2026-04-22 11:14:00

సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ఆలయాలు, వ్యక్తులపై దాడులు చేయడమే వైసీపీ పని..

రాజమహేంద్రవరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు” అని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి పత్రికల్లో ప్రచురిస్తున్నారని, తాను అనని మాటలను తప్పుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సాక్షి పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఆలయాలు, వ్యక్తులపై దాడులు చేయడం వైసీపీ పని అయిపోయిందని ఆయన విమర్శించారు. “వైసీపీ అరాచకాలు చూస్తూ ఊరుకునేది లేదు. ఎల్లకాలం రౌడీయిజం సాగదు” అని హెచ్చరించారు.

తన రాజకీయ జీవితంపై మాట్లాడిన బుచ్చయ్య చౌదరి, తాను ఎప్పుడూ కుల వ్యవస్థను ఉపయోగించుకోలేదని చెప్పారు. “నా వ్యక్తిత్వంతోనే ఎదిగాను. అందరితో సామరస్యంగా ఉంటున్నాను” అని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తులపై కాదని, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక విధానాలపై మాత్రమేనని స్పష్టం చేశారు.

సాక్షి పత్రికపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, “సాక్షి విషపుత్రిక. అవినీతి, అక్రమాల నుంచి పుట్టుకొచ్చింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “లక్షల కోట్లు, ప్యాలెస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి” అని ప్రశ్నించారు.

మొత్తంగా, బుచ్చయ్య చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Spotlight

Read More →