పహల్గాం ఉగ్రదాడికి ఇవాల్టితో ఏడాది పూర్తి..
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల హైఅలర్ట్..
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడికి ఇవాళ్టితో ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా బలగాలు హైఅలర్ట్‌లోకి వెళ్లాయి. నిఘా వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. ప్రతి వాహనం, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహల్గాం దాడి బాధితులను స్మరించుకున్నారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
“భారత్ ఎప్పటికీ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల కుట్రలు ఎప్పటికీ ఫలించవు” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.