Andhra Paris: ఆంధ్ర ప్యారిస్ కు పూర్వ వైభవం... తెనాలి కాలువల సుందరీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్! Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Andhra Paris: ఆంధ్ర ప్యారిస్ కు పూర్వ వైభవం... తెనాలి కాలువల సుందరీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్! Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!

Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం!

Gummadi Sandhyarani: సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయం ఆదివారం పార్టీ కార్యకర్తల సందడితో కళకళలాడింది. నియోజకవర్గంలోని నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి రాబోయే మహానాడు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

Published : 2026-05-17 19:42:00

ప్రతి మండలంలో ఘనంగా మహానాడు నిర్వహించాలి..

సాలూరులో మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించిన మంత్రి..

సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయం ఆదివారం పార్టీ కార్యకర్తల సందడితో కళకళలాడింది. నియోజకవర్గంలోని నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి రాబోయే మహానాడు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, గ్రామ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధానాలపై కార్యకర్తలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28 తేదీలలో మంగళగిరిలోని సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రతి మండలంలో మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలాల వారీగా సమావేశాలు, ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

గ్రామ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. మహానాడు విజయవంతం కావాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. “కార్యకర్తలే పార్టీకి అసలైన బలం” అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

సమావేశంలో నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానాడును విజయవంతం చేయాలనే ఉత్సాహం కార్యకర్తల్లో స్పష్టంగా కనిపించింది.

Spotlight

Read More →