SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! AP Assembly: ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు.. అమరావతి కదలనివ్వం.. అసెంబ్లీలో సభ్యుడి భావోద్వేగం.! AP Assembly: అమరావతి అజేయం... రాజధాని చట్టబద్ధత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం! MLA Galla Madhavi: విద్వేషం, విధ్వంసం, వినాశనం.. ఇవే జగన్ మార్క్ పాలన.. ఏపీ అసెంబ్లీలో సభ్యుల ఘాటు విమర్శలు.! Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి.. AndhraPradesh: అమరావతి విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది- బుచ్చయ్య చౌదరి! MLA Madhavi Reddy: చరిత్ర పునరావృతం.. నాడు తుగ్లక్, నేడు జగన్: రాజధాని మార్పుపై అసెంబ్లీలో సెటైర్లు.! Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! AP Assembly: ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు.. అమరావతి కదలనివ్వం.. అసెంబ్లీలో సభ్యుడి భావోద్వేగం.! AP Assembly: అమరావతి అజేయం... రాజధాని చట్టబద్ధత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం! MLA Galla Madhavi: విద్వేషం, విధ్వంసం, వినాశనం.. ఇవే జగన్ మార్క్ పాలన.. ఏపీ అసెంబ్లీలో సభ్యుల ఘాటు విమర్శలు.! Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి.. AndhraPradesh: అమరావతి విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది- బుచ్చయ్య చౌదరి! MLA Madhavi Reddy: చరిత్ర పునరావృతం.. నాడు తుగ్లక్, నేడు జగన్: రాజధాని మార్పుపై అసెంబ్లీలో సెటైర్లు.! Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన!

Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'!

India Argentina Gas Deal: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల భారత్‌కు ఎదురయ్యే గ్యాస్ ఆయిల్ కష్టాలకు అర్జెంటీనా చెక్ పెట్టింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్యాస్ నిక్షేపాలున్న వాకా మోయార్టా నుండి భారత్‌కు అన్లిమిటెడ్ సప్లై ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రాత్మక డీల్ వివరాలు..

Published : 2026-03-28 11:30:00

Middle East Conflict: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలన్నీ ఆందోళనలో ఉంటే, భారత్ మాత్రం తన వ్యూహంతో అందరినీ  ఆశ్చర్యపరుస్తుంది . ఇరాన్ లో  జరుగుతున్న దాడుల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని, ఎర్ర సముద్రంలో కార్గో షిప్పులు దారి మళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరిగి, మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత వస్తుందేమోనని ఆర్థిక నిపుణులు  అంచనా వేస్తున్నారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలోనే దక్షిణ అమెరికా  దేశమైన అర్జెంటీనా భారత్‌కు అండగా నిలబడి ప్రపంచానికి షాక్  ఇస్తుంది.

భారత్ గ్యాస్ కష్టాల్లో చిక్కుకుంటుందని ఇరాన్, అటు అమెరికా భావిస్తున్న తరుణంలో అర్జెంటీనా అంబాసిడర్ మరియానో అగస్టిన్ కౌసినో సంచలన ప్రకటన చేశారు. "మా దగ్గర ఉన్న గ్యాస్ నిక్షేపాలు ప్రపంచం మొత్తం వాడుకున్నా తరగవు.. భారత్‌కు ఎంత కావాలంటే అంత ఇచ్చేందుకు మేము సిద్ధం" అని ప్రకటించారు. దీంతో గల్ఫ్ దేశాల మీద మనకున్న డిపెండెన్సీ ఒక్కసారిగా తగ్గిపోయే అవకాశం  దొరికిందని చెప్పుకోవాలి.

అర్జెంటీనాలో 'వాకా మోయార్టా' అనే ప్రాంతం ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షేల్ గ్యాస్ రిజర్వ్. ఇక్కడ దాదాపు 458 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అంచనా. మన దేశానికి కావలసిన కుకింగ్ గ్యాస్‌లో 60%, ఎల్.ఎన్.జి (LNG)లో 50% ఇప్పటిదాకా కతర్, యూఏఈ లాంటి దేశాల నుండే తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అర్జెంటీనా తోడవ్వడంతో ఆ అవసరం లేకుండా పోయింది.

ఈ డీల్ రాత్రికి రాత్రే జరిగింది కాదు... గత ఏడాది కాలంగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, అర్జెంటీనా ప్రతినిధులతో రహస్యంగా చర్చలు  జరుపుతున్నారని సమాచారం. భారత్ కేవలం గ్యాస్ కొనడమే కాదు, అక్కడ డైరెక్ట్‌గా పెట్టుబడులు పెట్టి గ్యాస్ ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనివల్ల మధ్యలో బ్రోకర్లు ఉండరు, ధరలు కూడా మన అదుపులోనే ఉంటాయి.

ఈ డీల్ వల్ల మనకు కలిగే లాభాలు:

ఎనర్జీ సెక్యూరిటీ: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరిగినా మన గ్యాస్ సప్లైకి డోకా ఉండదు.

లిథియం నిల్వలు: గ్యాస్‌తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన లిథియం కూడా అర్జెంటీనా నుంచి తెచ్చుకోవచ్చు.

తక్కువ ధర: గల్ఫ్ దేశాలు పెట్టే ఇల్లాజికల్ కండిషన్స్ ఇకపై మనం వినాల్సిన పని లేదు.

చైనాకు కౌంటర్: లాటిన్ అమెరికా దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకున్న చైనాకు ఇది గట్టి ఎదురుదెబ్బ.

ఒకప్పుడు సమస్య వస్తే వేరే దేశాల వైపు చూసే భారత్.. ఇప్పుడు సమస్య రాకముందే బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అర్జెంటీనాతో కుదిరిన ఈ ఒప్పందం ఇంటర్నేషనల్ డిప్లమసీలో భారత్‌ను ఒక హీరోగా నిలబెట్టింది. యుద్ధం ఎక్కడ జరిగినా, ఎకానమీ తగ్గకుండా మన దారి మనం వెతుక్కునే రేంజ్‌కు భారత్ చేరుకుంది. ఇది కేవలం గ్యాస్ డీల్ మాత్రమే కాదు, నవ భారత్ సాధించిన వ్యూహాత్మక విజయం.

Spotlight

Read More →