Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

India China : చైనాతో సై అంటున్న భారత్.. సరిహద్దుల్లో మౌలిక వసతులకు టర్బో స్పీడ్!

చైనా ఎప్పటికైనా జిత్తులమారి దేశమేనని, ఆ దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదని భారత్ ఇప్పుడు గట్టిగా నిర్ణయించుకుంది. సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపు చర్యలకు దీ

2025-12-27 13:16:00

చైనా ఎప్పటికైనా జిత్తులమారి దేశమేనని, ఆ దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదని భారత్ ఇప్పుడు గట్టిగా నిర్ణయించుకుంది. సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానం చెప్పేందుకు భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' (Wall Street Journal) ప్రచురించింది. సరిహద్దు వెంబడి భారత్ చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన వేగం చైనాను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ పత్రిక పేర్కొంది.

అమెరికా నివేదిక ప్రకారం, 2020లో గాల్వన్ లోయలో జరిగిన సరిహద్దు ఘర్షణల సమయంలో భారత్ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. ఆ సమయంలో చైనా సైన్యం చాలా వేగంగా సరిహద్దులకు చేరుకోగలిగింది. చైనా తన వైపు ఉన్న అద్భుతమైన రోడ్లు, రైల్వే నెట్‌వర్క్ కారణంగా కేవలం కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో బలగాలను, భారీ ఆయుధాలను సరిహద్దులకు తరలించింది. కానీ, భారత్ వైపు సరైన రోడ్లు లేకపోవడం వల్ల మన సైన్యం అక్కడికి చేరుకోవడానికి దాదాపు వారం రోజులు పట్టింది. ఈ అంతరాన్ని గమనించిన భారత ప్రభుత్వం, యుద్ధ ప్రాతిపదికన సరిహద్దులను బలోపేతం చేయడం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణ బాధ్యతను చూసే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.

ఒకప్పుడు కేవలం $280 మిలియన్ల (సుమారు ₹2,300 కోట్లు) గా ఉన్న BRO బడ్జెట్‌ను భారత్ ఇప్పుడు $810 మిలియన్లకు (సుమారు ₹6,700 కోట్లు) పెంచింది. అంటే దాదాపు మూడు రెట్లు నిధులను పెంచడం ద్వారా భారత్ తన దృఢ నిశ్చయాన్ని చాటుకుంది. ఈ నిధులతో లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అత్యంత కఠినమైన హిమాలయ పర్వతాల్లో రహదారులు నిర్మిస్తున్నారు. మంచు కురుస్తున్న సమయంలో కూడా సైన్యం కదలికలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు టన్నెల్స్ (Tunnels) నిర్మిస్తున్నారు. ఉదాహరణకు, ఇటీవల పూర్తయిన 'సెలా టన్నెల్' వంటివి మన సైన్యానికి వ్యూహాత్మక బలాన్ని ఇస్తున్నాయి.

కేవలం రోడ్లు మాత్రమే కాదు, భారీ రవాణా విమానాలు ల్యాండ్ అయ్యేలా సరిహద్దుల్లో ఎయిర్‌స్ట్రిప్స్ (Air strips) నిర్మిస్తున్నారు. లడఖ్‌లోని న్యోమా వంటి ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో రన్‌వేలను భారత్ సిద్ధం చేస్తోంది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఢిల్లీ లేదా ఇతర ప్రాంతాల నుంచి నేరుగా యుద్ధ విమానాలను సరిహద్దులకు నిమిషాల్లో తరలించే అవకాశం ఉంటుంది. అలాగే, యుద్ధ ట్యాంకులు ప్రయాణించగలిగేలా బలమైన వంతెనల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది.

చైనా తన వైపు ఇప్పటికే భారీగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకుని భారత్‌ను భయపెట్టాలని చూస్తోంది. కానీ, ఇప్పుడు భారత్ కూడా సరిహద్దుల్లో ప్రతి అంగుళాన్ని కలుపుతూ రోడ్లు వేస్తుండటంతో చైనాకు ముచ్చెమటలు పడుతున్నాయి. గతంలో "సరిహద్దుల్లో రోడ్లు వేస్తే చైనా సైన్యం సులభంగా లోపలికి వస్తుందేమో" అన్న భయంతో భారత్ రోడ్లు వేయడానికి వెనుకాడేది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం "మనం బలంగా ఉంటేనే శత్రువు భయపడతాడు" అన్న ధోరణితో ముందుకు వెళ్తోంది. మారుమూల సరిహద్దు గ్రామాల వరకు ఇప్పుడు కరెంటు, ఇంటర్నెట్ మరియు రోడ్డు సౌకర్యాలు చేరుతున్నాయి. ఇది కేవలం సైన్యానికే కాదు, అక్కడ నివసించే ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తోంది.

Spotlight

Read More →