SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు!

Bangladesh Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో సంచలనం..! జిహాదీ శక్తులకు చెక్, బిఎన్పీకి ఘన విజయం!

Bangladesh Elections: బంగ్లాదేశ్ లో జరిగిన జాతీయ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. Bangladesh Nationalist Party ఘన విజయం సాధించి అధికారంలోకి రానుంది. మత రాజకీయాలకు చెక్ పడగా, ప్రజాస్వామ్యబద్ధ పాలనకు ప్రజలు మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. Jamaat-e-Islami Bangladesh మరియు ఇతర శక్తులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది.

Published : 2026-02-13 16:39:00

ప్రజాస్వామ్యానికి పట్టం కట్టిన బంగ్లాదేశ్ ఓటర్లు…

212+ సీట్లు బిఎన్పీ ఖాతాలో.. కొత్త ప్రభుత్వం దిశగా బంగ్లాదేశ్…

బంగ్లాదేశ్ రాజకీయాల్లో మెగా ట్విస్ట్.. బిఎన్పీ అధికారంలోకి…

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల ఫలితాలు ఆ దేశ రాజకీయాల్లో పెద్ద మార్పును తీసుకొచ్చాయి. గతంలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆమెను దేశం విడిచి వెళ్లేలా చేసిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు ప్రజలు అరాచకత్వాన్ని, మతోన్మాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశాయి. ఎన్నికల ఫలితాలను గమనిస్తే, అక్కడ ప్రజాస్వామ్యాన్ని నమ్మే శక్తులకు ప్రజలు పట్టం కట్టినట్లు కనిపిస్తోంది.

నిరసనల్లో కీలక పాత్ర పోషించి, తామే దేశాన్ని నడిపిస్తామని చెప్పుకున్న జన్-జీ (Gen Z) విద్యార్థులు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మొత్తం 300 సీట్లలో వీరు కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. రోడ్ల మీద గొడవలు చేయడం వేరు, దేశాన్ని పాలించడం వేరని అక్కడి ప్రజలు తమ ఓటు ద్వారా వీరికి ఒక పాఠం చెప్పారు. ప్రజలు వీరిని అల్లరి చిల్లరగా చూశారు తప్పితే, పరిపాలనకు సరిపోయే వ్యక్తులుగా భావించలేదు.

మతం పేరుతో రాజకీయం చేయాలని చూసిన జమాతే ఇస్లామీ పార్టీని కూడా ప్రజలు తిరస్కరించారు. ఈ పార్టీ బంగ్లాదేశ్‌ను మరో పాకిస్తాన్‌లా మార్చాలని, మతోన్మాదాన్ని పెంచాలని చూసింది. అయితే 299 స్థానాలకు జరిగిన పోటీలో వీరికి కేవలం 70 సీట్లు మాత్రమే దక్కాయి. హిందువులపై దాడులు చేయడం, తాలిబన్ తరహా పాలన తీసుకురావాలనుకున్న వారి పద్ధతులను ప్రజలు అంగీకరించలేదు. ఈ పార్టీ గతంలో పాకిస్తాన్ సైన్యానికి సహకరించి, స్వాతంత్ర సమరయోధులపై దాడులు చేసిన చరిత్ర కలిగి ఉండటం కూడా ఒక కారణం.

ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘనవిజయం సాధించి అధికారంలోకి రాబోతోంది. తారిక్ రహ్మాన్ నాయకత్వంలోని ఈ పార్టీ దాదాపు 212 నుండి 220 స్థానాల్లో ఆధిక్యాన్ని సాధించింది. ప్రజలు జిహాదీ ఉన్మాదాన్ని కాకుండా ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకుంటూ బిఎన్పీకి పట్టం కట్టారు. షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌కు చెందిన సగం మంది ఓటర్లు కూడా ఈసారి జమాతే ఇస్లామీని ఓడించడం కోసం బిఎన్పీకి ఓటు వేయడం గమనార్హం.

కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బిఎన్పీకి అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ అభివృద్ధి చెందాలన్నా, అక్కడి ప్రజలకు కరెంటు, నీరు వంటి కనీస సదుపాయాలు అందాలన్నా భారతదేశంతో స్నేహం చాలా అవసరమని కొత్త ప్రభుత్వం గుర్తించింది. మతోన్మాద శక్తులను పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవడం ఆ దేశ భవిష్యత్తుకు ఒక శుభ సంకేతం అని చెప్పవచ్చు.
 

Spotlight

Read More →