AP Fee Reimbursement: యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పేద విద్యార్థులకు భరోసా! Chandrababu Naidu: కూటమి ఐక్యతే ఏపీ అభివృద్ధి మంత్రం..! చంద్రబాబు క్లారిటీ! AP Politics: పాత గణాంకాలతో బురదజల్లే ప్రయత్నం..! వైసీపీ ‘పేటీఎం బ్యాచ్‌ల’పై అచ్చెన్నాయుడు ఫైర్! Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! AP Fee Reimbursement: యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పేద విద్యార్థులకు భరోసా! Chandrababu Naidu: కూటమి ఐక్యతే ఏపీ అభివృద్ధి మంత్రం..! చంద్రబాబు క్లారిటీ! AP Politics: పాత గణాంకాలతో బురదజల్లే ప్రయత్నం..! వైసీపీ ‘పేటీఎం బ్యాచ్‌ల’పై అచ్చెన్నాయుడు ఫైర్! Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!!

AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు!

Speaker Ayyanna Satirical Comments: అసెంబ్లీలో వైకాపా సభ్యుల నిరసనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు.. 11వ తేదీన 11 మంది సభ్యులు వచ్చి 11 నిమిషాల్లో వెళ్లిపోయారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Published : 2026-02-11 16:44:56

అసెంబ్లీ హౌస్‌లో హాట్ …

వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కౌంటర్ అటాక్…

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు.  ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  తీరుపై  వ్యంగ్యంగా సంధించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైకాపా సభ్యులు ప్రదర్శించిన నిరసన  సభ నుంచి వారు నిష్క్రమించిన తీరును ఉద్దేశించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా అంకెలతో కూడిన ఒక విచిత్రమైన పోలికను తెరపైకి తెచ్చారు. ఈరోజు 11వ తేదీ.. సభకు వచ్చింది 11 మంది.. వారు సభలో గడిపింది కేవలం 11 నిమిషాలు మాత్రమే! అంటూ ఆయన చలోక్తులు విసిరారు. 11వ తేదీన 11 మంది సభ్యులు వచ్చి కేవలం 11 నిమిషాల పాటు ఉండి వెళ్లిపోవడం ఒక విచిత్రమైన యాదృచ్ఛికమని  వ్యాఖ్యానించారు. అంతకుమించి వారు సభలో ఉండలేకపోయారని కేవలం నిరసన తెలపడానికే పరిమితమయ్యారని  అభిప్రాయపడ్డారు. 

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైకాపా సభ్యులు సభకు హాజరయ్యారు. అయితే వారు సభా కార్యక్రమాల్లో పాల్గొనడం కంటే, నిరసన గళం వినిపించడానికే ప్రాధాన్యతనిచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కాసేపు సభలో హడావుడి చేసిన వైకాపా సభ్యులు ఆ తర్వాత కొద్దిసేపటికే సభను వీడి బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామాన్ని గమనించిన స్పీకర్, వారు సభలో ఎంత తక్కువ సమయం ఉన్నారో వివరించడానికి ఈ '11' అంకెను ప్రాతిపదికగా తీసుకున్నారు.

సభాపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి  అయ్యన్నపాత్రుడు సభా నిబంధనల విషయంలో కఠినంగా ఉంటూనే, అప్పుడప్పుడు ఇలాంటి సరదా వ్యాఖ్యలతో వాతావరణాన్ని తేలికపరుస్తుంటారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అత్యున్నత వేదికపై, సభ్యులు కేవలం నిరసనలకే పరిమితం కావడం సరికాదనే అంతరార్థం ఆయన మాటల్లో ధ్వనించింది. ప్రతిపక్షం సభలో ఉండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ, వారు మాత్రం కేవలం నామమాత్రపు హాజరుతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టైం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. "11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు" అనే పదబంధం రాజకీయ విశ్లేషకులను సైతం ఆకట్టుకుంటోంది..

Spotlight

Read More →