Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Curd Vs Yogurt: యోగర్ట్ అంటే పెరుగేనా... చాలా మందికి తెలియని నిజాలు! Techie: రూ.2.5 లక్షల జీతం వదిలి కొత్త జీవితం.. కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన టెకీ! Weather Forecast: 21 ఏళ్ల అంచనాల చరిత్ర: ఈసారి కూడా ముందస్తుగానే దేశంలోకి రుతుపవనాల ప్రవేశం! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు! Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Curd Vs Yogurt: యోగర్ట్ అంటే పెరుగేనా... చాలా మందికి తెలియని నిజాలు! Techie: రూ.2.5 లక్షల జీతం వదిలి కొత్త జీవితం.. కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన టెకీ! Weather Forecast: 21 ఏళ్ల అంచనాల చరిత్ర: ఈసారి కూడా ముందస్తుగానే దేశంలోకి రుతుపవనాల ప్రవేశం! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు!

Weather Forecast: 21 ఏళ్ల అంచనాల చరిత్ర: ఈసారి కూడా ముందస్తుగానే దేశంలోకి రుతుపవనాల ప్రవేశం!

Weather Forecast: దేశవ్యాప్తంగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయని అధికారికంగా ప్రకటించింది.

Published : 2026-05-15 15:21:00
  • ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని ఐఎండీ ప్రకటన..
     
  • Environment: నాలుగు రోజులు అటూఇటూగా ఉండొచ్చని తెలిపిన భారత వాతావరణ శాఖ..

Weather Forecast: దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే పలకరించనున్నాయని అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏటా సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకే ఈ రుతుపవనాలు, ఈసారి ఐదు రోజులు ముందుగానే, అంటే మే 26నే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితుల మార్పుల దృష్ట్యా ఈ తేదీకి నాలుగు రోజులు అటు ఇటుగా, అంటే మే 22 నుంచి మే 30 మధ్య ఎప్పుడైనా వర్షకాలం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న సామాన్యులకు మరియు వర్షాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రైతులకు ఈ వార్త పెద్ద ఊరటనిస్తోంది.

రుతుపవనాల రాకను అంచనా వేయడంలో ఐఎండీ 2005 నుంచి అత్యంత ఖచ్చితమైన పద్ధతులను అవలంబిస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక స్టాటిస్టికల్ మోడల్‌ను ఉపయోగించి, ఆరు కీలక అంశాల ఆధారంగా ఈ అంచనాలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా వాయువ్య భారత్‌లో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, ఆగ్నేయ హిందూ మహాసముద్రంలోని గాలుల దిశ మరియు వేగం, ద్వీపకల్ప ప్రాంతంలో రుతుపవనాలకు ముందు కురిసే వర్షపాతం వంటి అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఈ శాస్త్రీయ విశ్లేషణల వల్లే గత 21 ఏళ్లలో (2015 మినహా) వాతావరణ శాఖ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. గత ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే అంచనా వేసిన తేదీకి, వాస్తవంగా రుతుపవనాలు వచ్చిన తేదీకి కేవలం ఒకటి రెండు రోజుల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.

Spotlight

Read More →