Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Curd Vs Yogurt: యోగర్ట్ అంటే పెరుగేనా... చాలా మందికి తెలియని నిజాలు! Techie: రూ.2.5 లక్షల జీతం వదిలి కొత్త జీవితం.. కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన టెకీ! Weather Forecast: 21 ఏళ్ల అంచనాల చరిత్ర: ఈసారి కూడా ముందస్తుగానే దేశంలోకి రుతుపవనాల ప్రవేశం! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు! Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Curd Vs Yogurt: యోగర్ట్ అంటే పెరుగేనా... చాలా మందికి తెలియని నిజాలు! Techie: రూ.2.5 లక్షల జీతం వదిలి కొత్త జీవితం.. కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన టెకీ! Weather Forecast: 21 ఏళ్ల అంచనాల చరిత్ర: ఈసారి కూడా ముందస్తుగానే దేశంలోకి రుతుపవనాల ప్రవేశం! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు!

Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్!

Puttaparthi: ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ పుట్టపర్తిలో ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగింది.

Published : 2026-05-15 14:43:00

అప్పుడు కియా.. ఇప్పుడు ఫైటర్ జెట్స్.. ఏఎంసీఏ కోసం ప్రత్యేక కృషి.. దేశ రక్షణలో ఏపీకి కొత్త పాత్ర..

23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూపించాం.. వైసీపీపై రాజకీయ విమర్శలు..

ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ పుట్టపర్తిలో ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్ట్‌తో రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

పుట్టపర్తిలో జరిగిన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి ఇకపై కేవలం ఆధ్యాత్మిక నగరంగా మాత్రమే కాకుండా, భారత రక్షణ రంగానికి కీలక కేంద్రంగా ఎదగబోతుందని పేర్కొన్నారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ ప్రాంతానికి మరో గొప్ప గుర్తింపు లభించిందన్నారు. ఒకప్పుడు ఎవరూ ఊహించని సమయంలో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరిగిందని, ఇప్పుడు అదే నేలపై ఫైటర్ జెట్లు తయారయ్యే పరిస్థితి రావడం గర్వకారణమని తెలిపారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఇది “రిటర్న్ గిఫ్ట్” అని లోకేష్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఎన్డీఏకు జిల్లా ప్రజలు ఘన విజయం అందించారని, అందుకే ఇప్పుడు భారీ పరిశ్రమల రూపంలో అభివృద్ధి తీసుకొస్తున్నామని చెప్పారు.

“కరువు నేలపై కార్లు పరిగెత్తించిన నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు అదే నేలపై ఫైటర్ జెట్లు ఎగిరేలా చేస్తున్నారు” అంటూ ఆయన ప్రశంసించారు. ఒకప్పుడు కియా కార్ల పరిశ్రమ జిల్లాకు అభివృద్ధి తీసుకొచ్చిందని, ఇప్పుడు ఏఎంసీఏ ప్రాజెక్ట్ జిల్లా భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అన్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను డీఆర్‌డీవో (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కలిసి ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్లు తయారు చేయనున్నట్టు చెప్పారు.

భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్స్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, వేలాది ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి లభిస్తుందని, భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యే డిఫెన్స్ పరికరాలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గత 23 నెలల్లో పెట్టుబడుల విషయంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నామని లోకేష్ తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి, ఆర్సెలార్ మిట్టల్ ద్వారా మరో భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు.

అమరావతి, పోలవరానికి నిధులు, విశాఖ ఉక్కు పరిరక్షణ, విశాఖ రైల్వే జోన్ వంటి అనేక కీలక అంశాల్లో కేంద్ర సహకారం లభించిందని చెప్పారు. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ కూడా రానుందని వెల్లడించారు.

ఈ విజయాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి పనిచేయడం వల్లే సాధ్యమయ్యాయని అన్నారు. “దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది” అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని లోకేష్ తెలిపారు. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఏపీ విజన్‌ను వివరించామని చెప్పారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారని, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ కూడా నిరంతరం సమన్వయం చేశారని వెల్లడించారు.

ప్రసంగం చివర్లో మంత్రి లోకేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ విమర్శలు కూడా చేశారు. “వాళ్లది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్… మనది ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్. వాళ్లది కిడ్నాప్ బ్యాక్‌గ్రౌండ్… మనది కియా బ్యాక్‌గ్రౌండ్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్ట్ రాయలసీమకు కొత్త పారిశ్రామిక శకం తెరలేపుతుందని, భవిష్యత్తులో అనంతపురం జిల్లా దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →