Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!

Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు!

Chandrababu Master Plan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పోర్టులను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పుష్కరాల లోపు గోదావరి జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. రవాణా వ్యయం తగ్గించేందుకు ఈవీ బస్సుల వినియోగాన్ని పెంచాలని మరియు ప్రతి పైసా ప్రజాధనం సద్వినియోగం కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Published : 2026-04-08 16:14:00

గుంతలు లేని రోడ్లే లక్ష్యం.. రహదారుల నిర్వహణకు సీఎం చంద్రబాబు కొత్త గైడ్‌లైన్స్!

పుష్కరాలకు ముందే రోడ్ల ముస్తాబు.. గోదావరి జిల్లాల రహదారుల కోసం రూ. 400 కోట్లు…

గుజరాత్ మోడల్‌లో పోర్టు కారిడార్లు.. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించేలా సీఎం మాస్టర్ ప్లాన్…

Chandrababu Master Plan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రహదారుల అనుసంధానమే ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని తీరప్రాంత ప్రాధాన్యతను గుర్తించి, మూలపేట నుండి కృష్ణపట్నం వరకు ఉన్న అన్ని ప్రధాన పోర్టులను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్ మోడల్ తరహాలో పోర్టు కారిడార్లను అభివృద్ధి చేయడం ద్వారా రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రోడ్ల నిర్వహణపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. "పాత్ హోల్ ఫ్రీ" (గుంతలు లేని) రహదారులే లక్ష్యంగా నిరంతర నిర్వహణ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నల్లరేగడి మట్టి ఉన్న ప్రాంతాల్లో రోడ్లు త్వరగా దెబ్బతినకుండా ఉండేందుకు 'వైట్ ట్యాపింగ్' లేదా 'హైబ్రిడ్ మోడల్' విధానాలను అనుసరించాలని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ. 400 కోట్లతో 531 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు మరియు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ఈవీ (ఎలక్ట్రిక్) బస్సుల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రవాణా వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు చేసేలా అన్ని కేటగిరీల్లో ఏసీ ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఈ-సైకిళ్లను మాస్ ట్రాన్స్‌పోర్ట్ సాధనాలుగా ప్రమోట్ చేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. సుమారు రూ. 24,502 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని, అమరావతి-ఖరగ్ పూర్ వంటి గ్రీన్ ఫీల్డ్ హైవేల ద్వారా పొరుగు రాష్ట్రాలతో కనెక్టివిటీని పెంచాలని సీఎం అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.

Spotlight

Read More →