Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!

Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు?

Amazon Layoffs: అమేజాన్ తన ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వచ్చే నెలలో సుమారు 14,000 మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. సంస్థలో మేనేజర్ల సంఖ్యను తగ్గించి, నిర్ణయాల ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

Published : 2026-04-08 18:10:00

ఐటీ రంగంలో మళ్లీ ప్రకంపనలు.. మేనేజర్లపై వేటు వేయబోతున్న అమేజాన్.

ఖర్చుల తగ్గింపుపై అమేజాన్ నజర్.. 14 వేల మంది తొలగింపుతో బిలియన్ల ఆదా?

మేనేజర్లు ఇక ఇంటికే? అమేజాన్ సీఈఓ ఆండీ జస్సీ సంచలన నిర్ణయం….

Amazon Layoffs: టెక్ ప్రపంచంలో గతేడాది నుంచి సాగుతున్న లేఆఫ్స్ పర్వం ఇంకా ముగిసినట్లు కనిపించడం లేదు. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖర్చులను నియంత్రించుకోవడంలో భాగంగా వచ్చే నెలలో సుమారు 14,000 మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులను తొలగించవచ్చని మార్కెట్ వర్గాల సమాచారం. సంస్థలోని మేనేజర్ల సంఖ్యను తగ్గించి, పనితీరును మెరుగుపరచాలనే 'బ్యూరోక్రసీ తగ్గింపు' (Reducing Bureaucracy) వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అమేజాన్ సీఈఓ ఆండీ జస్సీ గతంలోనే సంస్థలోని మేనేజర్ల నిష్పత్తిని పెంచాలని, అంటే ప్రతి మేనేజర్ కింద ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్యను కనీసం 15 శాతం పెంచాలని ఆదేశించారు. దీనివల్ల అనవసరమైన మేనేజర్ పోస్టులు తగ్గి, సంస్థలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ మార్పుల వల్ల సంస్థకు ఏటా 2.1 బిలియన్ డాలర్ల నుండి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఒకేసారి ఇంత మందిపై వేటు పడనుందనే వార్తలు ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

కేవలం మేనేజర్లే కాకుండా, పనితీరు సరిగ్గా లేని ఇతర విభాగాల్లోని ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. సంస్థలో మౌలిక మార్పులు చేస్తూ, స్టార్టప్ సంస్కృతిని మళ్లీ తీసుకురావాలని అమేజాన్ యాజమాన్యం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గత రెండేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమేజాన్, ఇప్పుడు మరోసారి లేఆఫ్స్ బాట పట్టడం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Spotlight

Read More →