NATS Charlotte: నాట్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం! అమెరికాలో తెలుగు మహిళల సందడి! TANA: ఒహాయోలో ముగిసిన తానా వాలీబాల్‌ సమరం... హోరాహోరీగా సాగిన పోటీలు! Iran-Israel Attacks: నేడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక.. ఉత్కంఠ రేపుతున్న భేటీ! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! Iran Updates: అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి మారాలి..! ఇరాన్ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు! China Drones: చైనా డ్రోన్ల వాడకంపై అమెరికా ఆంక్షలు...! స్వదేశీ డ్రోన్ల తయారీపై! Iran Politics: ఇరాన్ నాయకత్వంపై ప్రపంచ దృష్టి..! ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్! Trump: ట్రంప్ అంచనాలు ఫెయిల్... రగిలిన రణక్షేత్రం! ఇరాన్ ఊహించని ఎదురుదాడి! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! Iran-Israel: ఆ స్థానంలో ఎవరైనా సరే చంపేస్తాం... ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్! NATS Charlotte: నాట్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం! అమెరికాలో తెలుగు మహిళల సందడి! TANA: ఒహాయోలో ముగిసిన తానా వాలీబాల్‌ సమరం... హోరాహోరీగా సాగిన పోటీలు! Iran-Israel Attacks: నేడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక.. ఉత్కంఠ రేపుతున్న భేటీ! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! Iran Updates: అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి మారాలి..! ఇరాన్ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు! China Drones: చైనా డ్రోన్ల వాడకంపై అమెరికా ఆంక్షలు...! స్వదేశీ డ్రోన్ల తయారీపై! Iran Politics: ఇరాన్ నాయకత్వంపై ప్రపంచ దృష్టి..! ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్! Trump: ట్రంప్ అంచనాలు ఫెయిల్... రగిలిన రణక్షేత్రం! ఇరాన్ ఊహించని ఎదురుదాడి! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! Iran-Israel: ఆ స్థానంలో ఎవరైనా సరే చంపేస్తాం... ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్!

Iran-Israel Attacks: నేడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక.. ఉత్కంఠ రేపుతున్న భేటీ!

Iran-Israel Attack: యుద్ధ వాతావరణం అత్యంత భీకరంగా మారింది. శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. వరుసగా ఎనిమిదో రోజు కొనసాగుతున్న ఈ దాడుల్లో అమెరికా కూడా పాలుపంచుకోవడం గమనార్హం.

Published : 2026-03-08 10:58:00

యుద్ధం ముగిసిపోలేదు.. ఇరాన్‌కు ఇంకా 'సర్ ప్రైజ్ లు' ఉన్నాయి- నెతన్యాహు!

మధ్యప్రాచ్యంలో రణరంగం: టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం!

ఇరాన్ చమురు నిల్వలే లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు.

Iran-Israel Attack: యుద్ధ వాతావరణం అత్యంత భీకరంగా మారింది. శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. వరుసగా ఎనిమిదో రోజు కొనసాగుతున్న ఈ దాడుల్లో అమెరికా కూడా పాలుపంచుకోవడం గమనార్హం. ముఖ్యంగా టెహ్రాన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన యుద్ధ విమానాలతో పాటు ఆ దేశ ఆర్థిక మూలాధారమైన భారీ చమురు నిల్వ కేంద్రాలు (Oil Reservoirs) పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మరోవైపు ఇరు దేశాల అగ్రనేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించగా, దానికి బదులుగా దాడులను మరింత తీవ్రతరం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్ధం ఇక్కడితో ముగిసిపోలేదని, తదుపరి దశలో ఇరాన్‌కు ఊహించని షాక్‌లు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. కేవలం ఒక్క శనివారం రోజే తాము 300 లక్ష్యాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం (Energy Crisis) తలెత్తే అవకాశం ఉండటంతో, కువైట్ వంటి దేశాలు ముందుజాగ్రత్తగా చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

ఈ విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు తమ పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసేందుకు ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అగ్ర రాజ్యాల జోక్యం పెరిగి, పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →