ఐఫోన్ ప్రియులకు మరోసారి శుభవార్త తాజాగా ఐఫోన్ 16 ప్లస్ ధర భారీగా తగ్గడంతో టెక్ ప్రేమికుల్లో ఆసక్తి పెరుగుతుంది. రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం లభించునుంది. అయితే ఈ ఆఫర్ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో కాకుండా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉండటం విశేషం.
ఆపిల్ సంస్థ ఐఫోన్ 16 ప్లస్‌ను ప్రారంభంలో రూ.89,900 ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు విజయ్ సేల్స్ నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే సేల్‌లో ఈ ఫోన్ కేవలం రూ.71,890కే లభిస్తోంది. అంటే మొత్తం రూ.18,000 వరకు నేరుగా ధర తగ్గింపు లభిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అమెజాన్‌లో ఇదే ఫోన్ రూ.74,900గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,900 ధర పలుకుతోంది. ఈ పోలిక చూస్తే విజయ్ సేల్స్ డీల్ ప్రస్తుతం అత్యంత లాభదాయకంగా మారింది.
ఈ ధర తగ్గింపుకు కారణం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఆఫర్లేనని తెలుస్తోంది. విజయ్ సేల్స్ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో నేరుగా స్టోర్‌కు వెళ్లి ఫోన్‌ను చూసి కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశంగా మారింది. ముఖ్యంగా ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకునేవారికి ఇది సరైన సమయమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఫీచర్ల విషయానికి వస్తే ఐఫోన్ 16 ప్లస్ ప్రీమియం సెగ్మెంట్‌కు తగ్గట్టుగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇందులో A18 బయోనిక్ చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అల్యూమినియం బాడీతో పాటు IP68 రేటింగ్ ఉండటంతో నీరు, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది.
కెమెరా విభాగంలో కూడా ఐఫోన్ 16 ప్లస్ బలంగా ఉంది. వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ iOS 18తో వస్తోంది. భవిష్యత్తులో iOS 26 వరకు అప్‌డేట్ పొందే అవకాశం ఉంది. 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తోంది.