AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు?

Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్!

Vijay Tirunelveli Speech: తిరునెల్వేలి బహిరంగ సభలో టీవీకే అధినేత విజయ్ తన విడాకుల వార్తలపై పరోక్షంగా స్పందించారు. ఎన్నికల వేళ తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని, తన చుట్టూ ఉన్నవారినే ప్రత్యర్థులు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

Published : 2026-04-09 20:33:00

Vijay Tirunelveli Speech: తమిళ రాజకీయాల్లో ఇప్పుడు అంతా 'దళపతి' విజయ్ గురించే చర్చ నడుస్తోంది. తన కొత్త పార్టీ 'తమిళగ వెట్రి కళగం'  తరపున తిరునెల్వేలిలోని పాళయంకోట్టైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయ్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను చూసి ఉబ్బితబ్బిబ్బైన ఆయన, రాజకీయ అంశాలతో పాటు తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల పట్ల మొదటిసారి పరోక్షంగా స్పందించారు. తన ప్రత్యర్థులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక, తన కుటుంబ విషయాలను రోడ్డుపైకి లాగుతున్నారని  మండిపడ్డారు.

రాజకీయ ప్రసంగం మధ్యలో విజయ్ తన విడాకుల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ, ఏ మనిషికైనా కుటుంబం ఇచ్చే మద్దతు చాలా కీలకమని అన్నారు. తనను దెబ్బతీయడానికి తన చుట్టూ ఉన్న వ్యక్తులను వాడుకుంటున్నారని, ఎన్నికల సమయం చూసి తన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా తనను గానీ, తన లక్ష్యాన్ని గానీ ఎవరూ ఆపలేరని  స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అధికార పక్షంపై విజయ్ విమర్శల వర్షం కురిపించారు. డిఎంకె, బిజెపిలు పైకి వేర్వేరుగా కనిపిస్తున్నా, లోలోపల ఒకటయ్యే పని చేస్తున్నాయని ఆరోపించారు. తన పార్టీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని, కానీ ప్రజల మద్దతు ఉన్నంత కాలం ఏ శక్తీ తనను ఏమీ చేయలేదని ధీమా వ్యక్తం చేశారు. తన సినిమా ప్రయాణంలో ఎదురైన అడ్డంకులను గుర్తు చేస్తూ, రాజకీయాల్లో కూడా అవే ఎదురవుతున్నాయని, కానీ తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

విజయ్ భార్య సంగీత గతేడాది డిసెంబర్‌లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ పిటిషన్ కాపీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు సాక్షాత్తు విజయ్ తన సభలో ఈ విషయంపై నోరు విప్పడంతో అభిమానులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులే కావాలని సంగీత ద్వారా తనపై ఆరోపణలు చేయిస్తున్నారని విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

 విజయ్ ప్రసంగం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఒక పక్క తన సినిమా 'జననాయగన్' షూటింగ్ పనులు చూసుకుంటూనే, మరోపక్క పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో  బిజీగా ఉన్నారు. తన వ్యక్తిగత బాధను దిగమింగుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం ద్వారా, సామాన్య ఓటర్ల మనసు గెలుచుకోవడానికి  గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీనిపై డిఎంకె నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Spotlight

Read More →