Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Mango: డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండును ఎలా తినాలో తెలుసా? అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! Rajinikanth: ఆయన ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగం! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష! Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Mango: డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండును ఎలా తినాలో తెలుసా? అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! Rajinikanth: ఆయన ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగం! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష!

TANA: బే ఏరియాలో ఘనంగా తానా–బాటా పాఠశాల వసంతోత్సవం!

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల 13వ వార్షికోత్సవం “వసంతోత్సవం” అమెరికాలోని బే ఏరియాలో అత్యంత వైభవంగా జరిగింది.

Published : 2026-05-07 11:31:00

తెలుగు భాష, సంస్కృతికి ప్రవాస భారతీయుల అంకితభావానికి నిదర్శనంగా వార్షికోత్సవ వేడుక..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరియు బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల 13వ వార్షికోత్సవం “వసంతోత్సవం” అమెరికాలోని బే ఏరియాలో అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాస తెలుగు కుటుంబాలకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ఈ వేడుకకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు కలిపి దాదాపు 500 మందికి పైగా హాజరయ్యారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పిల్లలు ప్రదర్శించిన “గుణపాఠం”, “పరమానందయ్యగారి శిష్యులు”, “శివసంకల్పం” నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా శ్లోకాలు, పద్యాలు, గేయాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది “గ్రాడ్యుయేషన్ వాక్”. వివిధ కేంద్రాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వేదికపై నడుస్తూ వచ్చి సర్టిఫికెట్లు అందుకోవడం సభలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. రంగురంగుల బ్యానర్లు, పూల అలంకరణలు, కళాఖండాలతో ఆడిటోరియం పండుగ శోభను సంతరించుకుంది. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన అతిథులు వేడుకకు మరింత అందాన్ని తెచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎంపీ ఎం. భరత్ మరియు ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి హాజరయ్యారు. ప్రవాస తెలుగు పిల్లలు తెలుగు భాషలో చూపించిన ప్రతిభను చూసి వారు ఆనందం వ్యక్తం చేశారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, తానా ఈవీపీ శ్రీనివాస్ లావు కార్యక్రమం విజయవంతం కావడంపై నిర్వాహకులను అభినందించారు. పాఠశాల చైర్మన్ భాను మాగులూరి, కో-చైర్మన్ ప్రసాద్ మాంగిన, బాటా అధ్యక్షుడు శివ కాడ, అడ్వైజర్లు విజయ ఆసూరి, డాక్టర్ రమేష్ కొండ, కరికులమ్ డైరెక్టర్ డాక్టర్ గీతా మాధవి తదితరులు మాట్లాడుతూ, బే ఏరియాలో ప్రస్తుతం 250 మందికి పైగా విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని తెలిపారు.

ఎన్ఆర్ఐ పిల్లల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాలు పాఠశాల ప్రత్యేకతగా నిలుస్తున్నాయని నిర్వాహకులు చెప్పారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పిల్లలకు సులభంగా నేర్పించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు.

కార్యక్రమ విజయానికి తానా, బాటా బృందాలు సమిష్టిగా కృషి చేశాయి. తానా నాయకులు సుధీర్ వున్నం, వెంకట్ అడుసుమిల్లి, భక్త బల్లా, శ్రీకాంత్ దొడ్డపనేని, వెంకట్ కోగంటి తదితరులు పాల్గొన్నారు. బాటా కార్యవర్గ సభ్యులు వరుణ్, హరి ఎస్, సందీప్ కె, సంకేత్‌లతో పాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మళ్ళ, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, శిరీష బత్తుల, తారక దీప్తి మరియు పలు కమిటీల సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు కూడా పిల్లలను తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు.

కార్యక్రమ ప్రాంగణంలో విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ బూత్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ-లెర్నింగ్ డెమో కూడా నిర్వహించారు. చివరగా అతిథులందరికీ “భీమవరం రుచులు” అందించిన సాంప్రదాయ విందు భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Spotlight

Read More →