Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'!

Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు..

Rashmi: ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా తిరుపతిలో వైసీపీ నేత అభినయ్ రెడ్డి (భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు) ఆటోను ఎడ్లబండిపై ఉంచి ర్యాలీ నిర్వహించడాన్ని ఆమె తప్పుబట్టారు.

Published : 2026-05-02 20:15:00
  • రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం హేయమైన చర్య అన్న రష్మీ..
     
  • Cinema: ఎడ్లబండిపై ఆటోను ఉంచి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత అభినయ్ రెడ్డి..

Rashmi: ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి తన సామాజిక స్పృహను చాటుకుంటూ వార్తల్లో నిలిచారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా తిరుపతిలో వైసీపీ నేత అభినయ్ రెడ్డి ఒక ఆటోను ఎడ్లబండిపై ఉంచి ర్యాలీ నిర్వహించగా, ఆ చర్యను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం రాజకీయ ప్రచారం కోసం మూగజీవాలను హింసించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైనప్పటికీ, రష్మీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధీటుగా స్పందించారు.

తాను ఏ మతానికో లేదా రాజకీయ పార్టీకో వ్యతిరేకిని కాదని, తన పోరాటం కేవలం జంతువులపై జరిగే క్రూరత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని ఆమె ఎక్స్‌ (X) వేదికగా స్పష్టం చేశారు. గతంలో జంతుబలుల గురించి ప్రస్తావించినా, ఏనుగులపై జరిగే హింసను ప్రశ్నించినా తనను వ్యక్తిగతంగా దూషించారని, చివరకు దేశద్రోహి అని కూడా ముద్ర వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి విమర్శలకు తాను భయపడబోనని, ఏ రాజకీయ పార్టీ అయితే జంతు సంక్షేమం కోసం నిజాయతీగా పనిచేస్తుందో, ఆ పార్టీకి తాను బహిరంగంగా మద్దతు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. అనవసరమైన విమర్శలతో సమయం వృధా చేయకుండా, సమాజంలో మూగజీవాలపై జరుగుతున్న హింసను ఆపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రష్మీ ట్రోలర్లకు హితవు పలికారు.

Spotlight

Read More →