UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Toll Fees: విజయవాడ హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ రుసుములు.. నేటి నుంచే అమలు.! Tariff Refund: ఇకపై టారిఫ్ ల రీఫండింగ్ కు 45 రోజుల నిరీక్షణ! Fuel Price Hike 2026: వాహనదారులకు షాక్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Jet Fuel Price: రికార్డు స్థాయిలో విమాన ఇంధన ధరలు: రూ.2 లక్షల మార్కు దాటిన ఏటీఎఫ్! Srisailam: ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాటం... శ్రీశైలంలో నిలిచిపోయిన జలవిద్యుత్ ఉత్పత్తి! Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Toll Fees: విజయవాడ హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ రుసుములు.. నేటి నుంచే అమలు.! Tariff Refund: ఇకపై టారిఫ్ ల రీఫండింగ్ కు 45 రోజుల నిరీక్షణ! Fuel Price Hike 2026: వాహనదారులకు షాక్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Jet Fuel Price: రికార్డు స్థాయిలో విమాన ఇంధన ధరలు: రూ.2 లక్షల మార్కు దాటిన ఏటీఎఫ్! Srisailam: ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాటం... శ్రీశైలంలో నిలిచిపోయిన జలవిద్యుత్ ఉత్పత్తి! Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్!

Toll Fees: విజయవాడ హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ రుసుములు.. నేటి నుంచే అమలు.!

Vijayawada Toll Fees: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రయాణించే వాహనదారులకు ఊరటనిస్తూ టోల్ రుసుములను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల వాహనాలకు సంబంధించి టోల్ ధరలను రూ. 5 చొప్పున తగ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చింది.

Published : 2026-04-01 13:04:00
  • Business: టోల్ ప్లాజాల వద్ద కొత్త రేట్ల బోర్డులు: పాత ధరలకే మిగిలిన వాహనాలపై క్లారిటీ..
     
  • "నిత్యం ప్రయాణించే వారికి కలిసి రానున్న నిర్ణయం": 24 గంటల పాస్ ధరల్లోనూ తగ్గింపు..

Vijayawada Toll Fees: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రయాణించే వాహనదారులకు ఊరటనిస్తూ టోల్ రుసుములను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల వాహనాలకు సంబంధించి టోల్ ధరలను రూ. 5 చొప్పున తగ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చింది. ఈ మార్పుల వల్ల నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య వాహనదారులకు కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. ముఖ్యంగా భారీ వాహనాలు మరియు కమర్షియల్ కేటగిరీకి చెందిన వాహనాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

పంతంగి టోల్ ప్లాజా వద్ద 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాల రుసుమును ఒకవైపు ప్రయాణానికి రూ. 290 నుంచి రూ. 285కు తగ్గించారు. అదేవిధంగా, 24 గంటల వ్యవధిలో ఇరువైపులా ప్రయాణించే వాహనాలకు గతంలో ఉన్న రూ. 435 ధరను రూ. 430కి సవరించారు. అటు కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే తరహా తగ్గింపు వర్తిస్తుంది. ఇక్కడ 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ఒకవైపునకు రూ. 445 కాగా, ఇరువైపులా ప్రయాణానికి రూ. 670గా నిర్ణయించారు. దీనివల్ల రవాణా రంగంపై సానుకూల ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద సాధారణ ప్రయాణికులకు కూడా లబ్ధి చేకూరనుంది. ఇక్కడ కార్లు, జీపులు మరియు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి గతంలో ఉన్న రూ. 105 నుంచి రూ. 100కు ధరను తగ్గించారు. అలాగే 2 యాక్సిల్ వాహనాలకు రూ. 345గా, 3 యాక్సిల్ వాహనాలకు ఇరువైపులా ప్రయాణానికి రూ. 565గా రుసుములను ఖరారు చేశారు. అయితే, పైన పేర్కొన్న వాహన శ్రేణులు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాలకు పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని టోల్ ప్లాజా నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు.

Spotlight

Read More →