ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో, చాలా మంది ప్రజలు తక్కువ ఖర్చుతో నడిచే ఈవీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ కంపెనీ రూపొందించిన ఇన్‌విక్టా (Invicta) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ ఆఫర్ ప్రకటించబడింది. అసలు ధర రూ.95,000 కాగా, ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.30,950కే అందుబాటులో ఉంది. EMI రూపంలో రూ.1,697 చెల్లిస్తే ఈ స్కూటర్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
ఈ స్కూటర్‌ను గ్రీన్ కంపెనీ తయారుచేసింది, ఇది చవకగా కానీ నాణ్యమైన ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తూ మంచి పేరును సంపాదిస్తోంది. ఈ Invicta మోడల్‌కి 48V కెపాసిటీ కలిగిన లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. బ్యాటరీని వాహనంలో నుంచి తీయగలగడం, ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవడం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
డిజైన్ పరంగా చూస్తే ఈ స్కూటర్‌కి మెటల్ బాడీ ఉంది కాబట్టి దీర్ఘకాలం మన్నే సామర్థ్యం కలిగి ఉంటుంది. బరువు కేవలం 92 కిలోలు మాత్రమే. ముందుగా LED లైట్, డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. సడన్ బ్రేక్ వేస్తే స్కూటీ స్కిడ్ కాకుండా సేఫ్‌గా ఆగే విధంగా సిస్టమ్ పనిచేస్తుంది. అలాగే, కలర్‌ఫుల్ LCD డిస్‌ప్లే స్కూటర్‌కు ఆకర్షణీయతను ఇస్తోంది.
ధర పరంగా చూస్తే ఇది మార్కెట్లో అత్యంత చవకైన ఈవీలలో ఒకటి. అమెజాన్‌లో 63% భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది. అదనంగా, క్రెడిట్ కార్డు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కలిపి ధరను రూ.30,950కు తగ్గించుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కూటర్‌కి 3.6/5 రేటింగ్ లభించగా, వినియోగదారులు “ధరకు తగిన విలువ” అని పేర్కొన్నారు. కొంతమంది బ్యాటరీ లైఫ్ బాగుందని చెబుతుంటే, మరికొందరు మధ్యస్థంగా ఉందని తెలిపారు.
మొత్తంగా ఈ స్కూటర్ రోజువారీ అవసరాలకు, చిన్న దూర ప్రయాణాలకు అనువైనదిగా కనిపిస్తోంది. అయితే రఫ్ అండ్ టఫ్ రోడ్లపై ఉపయోగిస్తే రిపేర్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. రోజూ ఆఫీస్‌కి వెళ్లడం లేదా పట్టణ పరిధిలో ప్రయాణించే వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. తక్కువ ధర, ఆకర్షణీయ లుక్, మరియు డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా చాలా మంది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారు.