Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!!

Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు!

Leopard: శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలోని ఘాట్ రోడ్డుపై ఆదివారం రాత్రి చిరుతపులి సంచరించింది. భక్తులు ఆ దృశ్యాలను వీడియో తీయగా, అటవీశాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేస్తూ రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Published : 2026-04-13 14:58:58

Travel- ఖరేశ్వరం సమీపంలో దర్శనమిచ్చిన చిరుత…

నల్లమల అడవుల్లో పెరిగిన క్రూరమృగాల సంచారం…

ఆదివారం రాత్రి ఘాట్ రోడ్డులో చిరుతపులి హల్చల్…

Leopard: శ్రీశైల పుణ్యక్షేత్రం పరిసరాల్లో మళ్లీ చిరుతపులి సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి (ఏప్రిల్ 12, 2026) శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలోని ఘాట్ రోడ్డులో చిరుతపులి భక్తులకు తారసపడింది. ఈ పరిణామంతో అటు దర్శనానికి వెళ్తున్న భక్తులు, ఇటు తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

నంద్యాల జిల్లా పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో ఘాట్ రోడ్డుపై ఈ క్రూరమృగం కనిపించింది. దోర్నాల వైపు వెళ్తున్న ప్రయాణికులు రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చిరుతను గుర్తించారు. ప్రాణ భయంతో కొంతసేపు ఆందోళన చెందిన భక్తులు, ఆ తర్వాత ధైర్యం చేసి తమ సెల్ ఫోన్లలో చిరుత సంచారాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీశైలం అటవీ ప్రాంతం (NSTR) కావడం వల్ల వన్యప్రాణుల సంచారం సాధారణమే అయినప్పటికీ, ఘాట్ రోడ్డుపైకి చిరుత రావడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందించారు. భక్తుల భద్రత దృష్ట్యా గస్తీని పెంచామని, ఘాట్ రోడ్డులో రాత్రి వేళల్లో ప్రయాణించే వారు వాహనాలు దిగవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంపులుగా వెళ్లాలని, ఎక్కడా ఆగవద్దని సూచించారు.

Spotlight

Read More →