గూగుల్ తన సెర్చ్ (Google Search) సేవలకు మరో కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ పేరు పర్సనల్ ఇంటెలిజెన్స్ (Personal Intelligence)దీని ద్వారా గూగుల్ సెర్చ్‌లోని ఏఐ మోడ్ మరింత తెలివిగా పనిచేస్తుంది. ముఖ్యంగా యూజర్ అనుమతిస్తే, జీమెయిల్ (Gmail Integration) మరియు గూగుల్ ఫొటోస్‌లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా సెర్చ్ ఫలితాలను చూపిస్తుంది. దీంతో సెర్చ్ అనుభవం మరింత సులభంగా, ఉపయోగకరంగా మారనుంది.
ఇప్పటికే గూగుల్ జెమినీ ఏఐలో ఇలాంటి ఫీచర్‌ను పరీక్షించింది. అయితే ఇప్పుడు అదే సౌకర్యాన్ని నేరుగా గూగుల్ సెర్చ్‌లోని ఏఐ మోడ్‌కు (Google AI Mode) తీసుకొచ్చింది. దీని వల్ల ప్రతీసారి యూజర్ తన అవసరాలను వివరంగా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏఐ యూజర్ పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైన సమాచారం చూపించే ప్రయత్నం చేస్తుంది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే, యూజర్ స్వయంగా పర్సనల్ ఇంటెలిజెన్స్‌ను ఆన్ చేయాలి. ఆ తర్వాత ఏఐ మోడ్ జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌తో (Google Photos)
కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకు, మీరు ప్రయాణంలో ఉన్నారని అనుకుందాం. మీరు రెస్టారెంట్ల కోసం సెర్చ్ చేస్తే, మీ జీమెయిల్‌లో ఉన్న హోటల్ బుకింగ్ వివరాలను ఏఐ గుర్తించి, ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న భోజన కేంద్రాలను సూచిస్తుంది. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు తీసిన ఫొటోలను పరిశీలించి, మీకు నచ్చే ప్రదేశాలు లేదా కార్యకలాపాల గురించి సూచనలు ఇస్తుంది.
అయితే ఈ సూచనలు యూజర్‌కు తెలియకుండా రావు. గూగుల్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే. యూజర్ అనుమతి లేకుండా ఎలాంటి వ్యక్తిగత డేటాను ఉపయోగించదు. ఈ ఫీచర్ పూర్తిగా ఐచ్చికం. కావాలంటే జీమెయిల్ లేదా ఫొటోస్ యాక్సెస్‌ను ఎప్పుడైనా ఆపేయవచ్చు. ఫీచర్‌ను ఆఫ్ చేస్తే, ఏఐ వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడం ఆపేస్తుంది.
ప్రస్తుతం ఈ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ గూగుల్ ల్యాబ్స్‌లో ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. ఇది ఇప్పటికి అమెరికాలో మాత్రమే పనిచేస్తోంది. అలాగే ఏఐ
(Artificial Intelligence) ప్రో లేదా ఏఐ అల్ట్రా సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే ఈ అవకాశం ఉంది. వ్యక్తిగత గూగుల్ అకౌంట్ ఉండాలి. బిజినెస్, స్కూల్ లేదా వర్క్‌స్పేస్ అకౌంట్లకు ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఇంగ్లిష్ భాషలో మాత్రమే పనిచేస్తోంది.
ప్రైవసీ విషయంలో గూగుల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. యూజర్ ఇమెయిల్స్ లేదా ఫొటోలను ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగించబోమని స్పష్టం చేసింది. అవి కేవలం యూజర్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికే ఉపయోగిస్తామని తెలిపింది. అంటే మీ వ్యక్తిగత సమాచారం మీ నియంత్రణలోనే ఉంటుంది.
భారతదేశ వినియోగదారులకు మాత్రం (AI Search Feature) ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే భవిష్యత్తులో ఇది భారత్‌లో కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. గూగుల్ లక్ష్యం ఒక్కటే. సెర్చ్ అనుభవాన్ని మరింత వ్యక్తిగతంగా, వేగంగా మార్చడం. ముఖ్యంగా ప్రయాణాలు, షాపింగ్, భోజనం, రోజువారీ పనుల ప్లానింగ్‌లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైతే, గూగుల్ సెర్చ్ ఒక సాధారణ సెర్చ్ టూల్ కంటే వ్యక్తిగత సహాయకుడిలా మారే అవకాశం ఉంది.