Group 2: హైదరాబాద్‌ శిల్పకళావేదికలో గ్రూప్‌–2 నియామక పత్రాల మేళా..! సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేత..!

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న జరగనున్న పుష్పయాగ మహోత్సవం సందర్భంగా టీటీడీ (TTD) ముఖ్య ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా అక్టోబర్ 29 మరియు 30 తేదీల్లో జరిగే పూజా కార్యక్రమాల కారణంగా కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ఈ రెండు రోజులలో ఆలయంలో సాధారణ దర్శనాలకు అనుమతి ఉన్నప్పటికీ, ప్రత్యేక సేవలు మాత్రం నిర్వహించబడవు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది.

AndhraPradesh: ఏపీలోని ఆ కాంట్రాక్టు సిబ్బందికి షాక్.. 50 ఏళ్ల వరకే సర్వీస్..!

అక్టోబర్ 29న రాత్రి 8 నుండి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇది పుష్పయాగానికి శుభారంభ సూచికగా భావిస్తారు. ఆ రోజు సాయంత్రం జరిగే సహస్రదీపాలంకార సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30న ప్రధాన పుష్పయాగం జరగనుంది. ఆ రోజున రెండవ అర్చన, నైవేద్యం అనంతరం శ్రీమలయప్పస్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణ మండపానికి వేంచేపు చేసి, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, చందనం, తేనె వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు.

Gold prices: వామ్మో ఒక్కరోజులోనే రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు.. ఎంత అంటే!

మధ్యాహ్నం 1 గంట నుండి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనంతరం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీమలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. భక్తులు ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించుకునే అవకాశం ఉంటుంది. పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దు అయ్యాయి. అయితే తోమాల, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు.

రాత పరీక్ష లేదు! అకౌంటెంట్, వాచ్‌మాన్ సహా 13 విభాగాలలో...కేవలం ఆ జిల్లా వారికి మాత్రమే!!

ఇక, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు అక్టోబర్ 16న అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజుల పాటు యాగశాలల్లో వైదిక కార్యక్రమాలు, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి వంటి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

Lokesh: వైసీపీలా కాదు.. బుల్డోజర్లను అభివృద్ధికి వాడుతున్నాం.. మంగళగిరిలో కొత్త షోరూమ్.. మంత్రి లోకేశ్!

భక్తులు రూ.516 చెల్లించి ఈ పవిత్రోత్సవ సేవల్లో పాల్గొనవచ్చు. పాల్గొన్న వారికి పవిత్రమాల, ఉత్తరీయం, రవిక, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ పవిత్రోత్సవాల కారణంగా అక్టోబర్ 16న తిరుప్పావడ సేవను, 17 నుండి 19 వరకు నిత్య కళ్యాణోత్సవ సేవలను రద్దు చేశారు. భక్తులు ఈ వివరాలను గమనించి తమ దర్శన, సేవా ప్రణాళికలను సరిచేసుకోవాలని టీటీడీ సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఎందుకోసం అంటే ?
హ్యుందాయ్ వెన్యూ 2025 నెక్స్ట్ జనరేషన్ మోడల్‌! స్టైలిష్ లుక్‌, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు!
Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!
BSF Constable: బీఎస్‌ఎఫ్‌లో క్రీడాకారులకు గుడ్ న్యూస్..! రాత పరీక్ష లేకుండా ఉద్యోగం.. జీతం రూ.69,000 వరకు..!
RRB NTPC ఉద్యోగాలు: మొత్తం ఖాళీలు, వయసు & జీతం పూర్తి వివరాలు!!