ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 20 ఖాళీలను కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు వివిధ విభాగాల్లో ఉంటాయి, అకౌంటెంట్ నుండి వాచ్ మాన్ వరకు పోస్టులు అందులో ఉన్నాయి. మొత్తం 13 విభాగాల్లో పోస్టులు ఉన్నాయని సమాచారం.
ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే చేయాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసే అవకాశం లేదు. దరఖాస్తు ఫారమ్‌ను https://ntr.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
పోస్టులకు సంబంధించిన అర్హతలు కూడా వివిధంగా వివరించడం జరిగినది. కొన్ని పోస్టులకు 10వ తరగతి ఇంటర్, డిగ్రీ పూర్తి కావాలి. అలాగే పని అనుభవం కూడా తప్పనిసరి. జీతం కూడా పోస్టుల ప్రకారం భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు రూ.7,944 నుండి రూ.18,536 వరకు జీతం చెల్లించబడుతుంది.
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ చిరునామాకు పంపించాలి:డిస్ట్రిక్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-294, గడ్డే పూర్ణ చంద్ర రావ్ రోడ్, మారుతీ నగర్, సెకండ్ లేన్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా దరఖాస్తుతో పాటు విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు కూడా జత చేయాలి.
దరఖాస్తులను పరిశీలించి, అర్హత గల అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. పూర్తి వివరాలు, పోస్టుల సమాచారం, అర్హత, దరఖాస్తు విధానం కోసం
https://ntr.ap.gov.in వెబ్ లింక్ లో చూడవచ్చు.
ఇలా ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం కొనసాగినప్పటికీ, తగిన విధంగా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ సమర్పించి, తమ అవకాశాలను పరీక్షించుకోవచ్చు. ప్రభుత్వ శాఖ ద్వారా ఇచ్చిన అన్ని సూచనలు పాటించడం ద్వారా దరఖాస్తులు సమర్థవంతంగా పరిశీలించబడతాయి.