ఆస్ట్రేలియాలో నారా లోకేశ్‌కు ఊహించని సర్‌ప్రైజ్! చిన్నారి ప్రశంస - అన్ని థాంక్స్ బాస్ కే.! ఈ వారంలోనే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై మరోసారి అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు దేశాన్ని విభజన వైపు నడిపిస్తున్నాయన్న ఆరోపణలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, సోషల్ పాలసీలపై ట్రంప్ చూపుతున్న నిర్లక్ష్యం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో రోడ్లపైకి వచ్చారు. "NO KINGS" అనే నినాదంతో అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చికాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో భారీ ర్యాలీలు జరిగాయి.

Sakhi Health Check: ఏపీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్..! ఉచిత వైద్య పరీక్షలతో సురక్ష ప్రాజెక్ట్ ప్రారంభం..!

ఈ నిరసనల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ట్రంప్‌పై మండిపడుతూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. “ఇతర దేశాల మధ్య యుద్ధాలు ఆపాను, ప్రపంచానికి శాంతి తీసుకువచ్చాను” అంటూ గొప్పలు చెప్పుకోవడం ముందు నీ దేశంలోని సమస్యలపై దృష్టి పెట్టు అంటూ సోషల్ మీడియా వేదికలపై విరుచుకుపడుతున్నారు. “నీ పాలన వల్ల అమెరికాలో జాత్యహంకారం, అసమానతలు పెరిగాయి. పేదల జీవితం కష్టాల్లో కూరుకుపోయింది. ముందుగా నీ దేశాన్ని బాగుచేసుకో” అని విమర్శిస్తున్నారు.

ఆ వజ్రపు ఉంగరం.. సిగ్గుతో హింట్! విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ!

కొంతమంది అమెరికన్లు “ఇది ప్రజాస్వామ్య దేశం, కానీ ఇప్పుడు నియంతృత్వ పాలన లాగా మారింది” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో నిధుల కుదింపు, మైనారిటీలపై ఆంక్షలు, మహిళల హక్కులపై దాడులు వంటి చర్యలు దేశ ప్రజలను తీవ్రంగా కలచివేశాయి. నిరసనకారులు అమెరికా జెండాలు ఊపుతూ, “We Need Justice”, “Equality for All”, “Trump Must Listen” వంటి నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు.

Costly Sweet: దేశంలో లోనే అత్యంత ఖరీదు అయిన స్వీట్..! ధర ఎంతో తెలుసా..!

విదేశాల్లో కూడా ఈ నిరసనలు ప్రతిధ్వనించాయి. యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని అమెరికా ఎంబసీల ముందు అమెరికన్లు చేరి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. “ప్రపంచానికి శాంతి ప్రసాదించాలంటే ముందుగా నీ దేశంలో శాంతి నెలకొల్పు” అని ట్రంప్‌కి సూచించారు.

బిగ్‌బాస్ 9లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 5 రేసు నుంచి ఔట్! ఊహించని ఎలిమినేషన్‌తో ఫ్యాన్స్‌కు..

అమెరికా రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి ట్రంప్ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నిరసనకారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, వైట్ హౌస్ మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రజలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్న ఈ పరిస్థితి అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో మరో కొత్త అధ్యాయంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

ట్రంప్‌కు అమెరికాలోనే భారీ షాక్ తగిలింది. ప్రజల నిరసనలు ఆయన పాలనపై పెరుగుతున్న విసుగు, అసంతృప్తికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే “ముందుగా నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్!” అని గళమెత్తుతున్న అమెరికా వాణి ఆయన చెవికి ఎప్పుడు చేరుతుందనేది చూడాలి.

K-Ramp: కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో మంచి ఓపెనింగ్.. K-Ramp మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే!
Highcourt: గురుకుల పార్ట్‌టైమ్ టీచర్లకు హైకోర్టు ఊరట..! కీలక ఆదేశాలు జారీ..!
కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్!
ISRO విజయం సూర్యుడి నుండి వచ్చే ఉద్గారాల (CME) రహస్యాన్ని ఛేదించిన చంద్రయాన్-2!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రజల ఆగ్రహం..నో కింగ్స్ నినాదాలు!!
Digital Safety: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి NPCI హెచ్చరిక..! ఈ తప్పులు చేయొద్దు..!
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..! 12 ప్యాకేజీల ప్రాజెక్ట్, భూసేకరణ త్వరలో..!