IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ!

FIFA 2026 Ticket Prices: బాబోయ్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్..!!

FIFA 2026 Ticket Prices: ఫిఫా 2026 టికెట్ల విక్రయాల్లో అక్రమ ధరల దందా. అమెరికా, మెక్సికో వేదికలుగా జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం రీ-సేల్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి.

Published : 2026-02-12 09:27:00

అందని ద్రాక్షలా మారుతున్న ప్రపంచకప్ సమరం.

లక్షల ధర పలుకుతున్న ఒక్కో గ్యాలరీ సీటు.

ఫుట్‌బాల్ అభిమానులకు షాకిస్తున్న ధరలు


ఫుట్‌బాల్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి అది ఒక భావోద్వేగం. అటువంటిది, 2026లో జరగబోయే ఫిఫా ప్రపంచకప్  చూడాలనే సామాన్య అభిమానుల కలపై ధరల పెరుగుదల పిడుగు  పడుతుందని చెప్పుకోవాలి. మెక్సికో, అమెరికా  కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రీ-సేల్ ప్లాట్‌ఫారమ్‌లలో ధరలు కనివిని ఎరుగని స్థాయికి చేరుకున్నాయి. ఫిఫా అధికారిక రీ-సేల్ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయాలనుకుంటున్న అభిమానులు అక్కడి రేట్లను చూసి అవాక్కవుతున్నారు.

ప్రస్తుత గణాంకాల ప్రకారం, జూన్ 11న మెక్సికో సిటీలోని చారిత్రాత్మక అజ్టెకా స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్  కోసం కేటగిరీ-3 సీటు ధర ఏకంగా 5,324 డాలర్లుగా (సుమారు ₹4,40,000) ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ టికెట్ అసలు ధర కేవలం 895 డాలర్లు మాత్రమే. అంటే రీ-సేల్ వెబ్‌సైట్‌లో దాదాపు ఆరు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక జూలై 19న న్యూజెర్సీలో జరగనున్న గ్రాండ్ ఫినాలే (ఫైనల్ మ్యాచ్) టికెట్ల పరిస్థితి వర్ణనాతీతం. ఫైనల్ మ్యాచ్ కోసం అత్యంత ఎత్తైన స్టాండ్స్‌లో ఉండే ఒక్కో టికెట్ ధరను 1,43,750 డాలర్లుగా నిర్ణయించారు. దీని భారతీయ కరెన్సీ విలువ కోటి రూపాయల పైమాటే! ఈ టికెట్ అసలు ధర 3,450 డాలర్లు కాగా, ఇప్పుడు దానిని 41 రెట్లు అధిక ధరకు రీ-సేల్ చేస్తున్నారు. ప్రపంచకప్ ఫైనల్ చూడాలంటే కనీస ధర 9,775 డాలర్లుగా ఉండటం గమనార్హం.

టికెట్ల విక్రయాల్లో జరుగుతున్న ఈ ‘దందా’పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలు మండిపడుతున్నాయి. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానుల సంఘం ప్రతినిధి గిల్లామ్ అప్రెట్రే మాట్లాడుతూ.. ఇది ఒక మోసం. నిజమైన ఫుట్‌బాల్ ప్రేమికులకు టికెట్లు అందకుండా చేసి కేవలం వ్యాపారం కోసం కొనుగోలు చేసే వారికి ఇవి దక్కడం దురదృష్టకరం. ఫిఫా ఈ విషయంలో విఫలమైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విమర్శలపై ఫిఫా తనదైన శైలిలో స్పందించింది. తాము కేవలం ఒక మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తున్నామని, రీ-సేల్ ధరలను తాము నిర్ణయించమని ఫిఫా స్పష్టం చేసింది.

ఒకవైపు ధరలు ఆకాశాన్నంటుతుంటే కొన్ని మ్యాచ్‌లకు మాత్రం టికెట్ల ధరలు స్వల్పంగా తగ్గడం విశేషం. కాలిఫోర్నియాలో జరగనున్న ఆస్ట్రియా, జోర్డాన్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు ధర కంటే తక్కువకే లభిస్తున్నాయి. ఉదాహరణకు 620 డాలర్లకు కొన్న టికెట్ ఇప్పుడు 552 డాలర్లకే అందుబాటులో ఉంది. ఇది ఇలా ఉంటే, ఫిఫా ఇప్పటివరకు 50 కోట్లకు పైగా టికెట్ అభ్యర్థనలు స్వీకరించినట్లు సమాచారం. ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న ‘లాస్ట్ మినిట్’ సేల్స్ కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా 60 డాలర్లకే టికెట్లు ఇస్తామని ఫిఫా చెబుతున్నప్పటికీ, అవి అతి తక్కువ సంఖ్యలో ఉండటంతో అభిమానుల అసంతృప్తి చల్లారడం లేదు.

Spotlight

Read More →