IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! IPL: ఫస్ట్ బాల్‌కే సిక్స్.. 'సిక్సర్ల' సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు! 40 లోపు బంతుల్లో.. IPL 2028: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! IPL 2026: ఐపీఎల్‌లో సంజూ శామ్సన్ సరికొత్త చరిత్ర: కోహ్లీ, రాహుల్ రికార్డుల సమం.. ఢిల్లీపై ధాటిగా ఆడి ఎలైట్ జాబితాలోకి....! Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Sports News: భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! IPL: ఫస్ట్ బాల్‌కే సిక్స్.. 'సిక్సర్ల' సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు! 40 లోపు బంతుల్లో.. IPL 2028: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! IPL 2026: ఐపీఎల్‌లో సంజూ శామ్సన్ సరికొత్త చరిత్ర: కోహ్లీ, రాహుల్ రికార్డుల సమం.. ఢిల్లీపై ధాటిగా ఆడి ఎలైట్ జాబితాలోకి....! Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Sports News: భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు!

ఆఫ్ఘనిస్థాన్‌పై టీ20 సిరీస్ గెలుపుతో చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ...

ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విజయం స

Published : 2024-01-15 15:43:00

ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.

ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ టీమిండియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

భారత్‌ను అత్యధిక టీ20 సిరీస్‌లు గెలిపించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఇది 12వ టీ20 సిరీస్ విజయంగా ఉంది.

ఆఫ్ఘనిస్థాన్‌పై గెలుపుతో 11 టీ20 సిరీస్ విజయాల కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు. ఇక మాజీ దిగ్గజం ఎంఎస్ ధోని భారత కెప్టెన్‌గా 8 సిరీస్ విజయాలను అందించాడు.

ఇక ఆఫ్ఘనిస్థాన్‌పై ఇండోర్ మ్యాచ్ గెలుపుతో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 41వ విజయం కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో గెలిస్తే మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న 42 విజయాల రికార్డును సమం చేయనున్నాడు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కాగా టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని దాదాపు 14 నెలల తర్వాత టీ20 జట్టులో రోహిత్ శర్మకు చోటివ్వగా... ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు.

రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన చేశాడు.  తొలి మ్యాచ్‌లో సున్నా పరుగులకే రనౌట్ అవ్వగా... రెండవ మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయ్యింది.

తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా ఆదివారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, శివమ్ దూబే రాణించగా, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన అక్షర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’ అవార్డ్ దక్కింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →