ఆఫ్రికాలోని కాళహారి అడవిలో అరుదైన వన్యప్రాణి సంఘటన చోటు చేసుకుంది. సిర్గా అనే ఆడ సింహి నివసిస్తున్న ప్రైవేట్ రిజర్వ్‌లో ఏకంగా ఏడు అడవి సింహాలు ఒకేసారి ప్రవేశించాయి. ఈ ఘటనను అక్కడి వన్యప్రాణి సంరక్షకుడు వాలెంటిన్ గ్రూనర్ సోషల్ మీడియాలో పంచుకోగా, వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.
గ్రూనర్ మాటల్లో రాత్రి సమయంలో ఒక పెద్ద మగ సింహం, రెండు ఆడ సింహాలు, నాలుగు పిల్లలు ఒక గుంపు సమూహంల 2,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సిర్గా ప్రాంతంలోకి చొరబడ్డాయి. మొదట ఫెన్స్ దగ్గరే పోరు జరిగింది. ఆ దృశ్యం చాలా భయంకరంగా అనిపించింది అని చెప్పారు.
సిర్గా మొదట తాను ఎదుర్కొనే ప్రయత్నం చేసినా చివరికి వెనక్కి తగ్గి తన భద్ర స్థలానికి చేరుకుంది. ఆ నిర్ణయమే ఆ
సిర్గా (ఆడ సింహం) ప్రాణాలను కాపాడిందని గ్రూనర్ తెలిపారు. సిర్గా తెలివిగా వ్యవహరించింది. ఆడ సింహాలు చాలా ధైర్యంగా ఉన్నా పెద్ద గుంపును ఎదుర్కోవడం ప్రమాదకరం. అందుకే వెనక్కి తగ్గింది అని ఆయన వివరించారు.
తర్వాత వన్యప్రాణి సంరక్షక బృందం సాయం తో ఆ సింహాల గుంపును బయటకు పంపగలిగారు. ఆ సింహాల గుంపు అక్కడే ఉండి వేట మొదలుపెట్టితే లేదా నీటి బావి దొరికితే సిర్గా ప్రాంతం వారి కొత్త రాజ్యంగా మారిపోయేది. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. సిర్గా సురక్షితంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.
సిర్గా కథ
2012లో పుట్టిన సిర్గా పది రోజుల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి గ్రూనర్ సిర్గా ను పెంచుతున్నారు. ఇప్పుడు సిర్గా 2,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న బోట్స్‌వానా ప్రాంతంలోని ప్రైవేట్ రిజర్వ్‌లో స్వేచ్ఛగా వేటాడుతూ జీవిస్తోంది. ఆ స్థలం న్యూయార్క్ సెంట్రల్ పార్క్ కంటే ఆరు రెట్లు పెద్దదని గ్రూనర్ తెలిపారు.
ఆయన చెప్పినదేమిటంటే సిర్గా ఇతర సింహాల గుంపుతో కలవలేదు ఎందుకంటే అవి సిర్గాను అంగీకరించవు చంపేస్తాయి కూడా. అడవిలో సింహాలు వేరే గుంపుతో కలవవు. ప్రతి గుంపు తమదైన భూభాగం, నీరు, ఆహారం కోసం పోరాడుతుంది అని తెలిపారు.
సోషల్ మీడియాలో స్పందనలు
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నా గుండె ఆగిపోయినట్టైంది. సిర్గా సేఫ్‌గా ఉందన్నందుకు చాలా సంతోషం అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు సిర్గా మరియు వన్య సింహాలు రెండూ సురక్షితంగా ఉన్నాయంటే నిజంగా అద్భుతం అని రాశారు.
ఈ సంఘటన వన్యప్రాణి ప్రపంచంలోని సహజ పోరాటాన్ని చూపించింది. ప్రతి సింహి తన భూభాగం కోసం ఎంత దృఢంగా పోరాడుతుందో సిర్గా మళ్లీ నిరూపించింది. అదే సమయంలో, మానవ జోక్యం లేకుండా ప్రకృతిలో జరిగే సమతుల్యాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.