మాంసం అంటే చాలామందికి ఇష్టమైన ఆహారం. రోజూ తినకపోయినా వారానికి ఒకసారి ముక్క తప్పక కావాలి అనుకునే వాళ్లు మన చుట్టుపక్కలే చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు మాంసం ఎక్కువగా తింటున్నాయో తెలుసా? తాజా అంతర్జాతీయ గణాంకాలు ఈ విషయాన్ని ఆసక్తికరంగా బయటపెట్టాయి.
ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ (FAO) ఆధారంగా స్టాటిస్టా రీసెర్చ్ రూపొందించిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మాంసం వినియోగంలో హాంకాంగ్ అగ్రస్థానంలో ఉంది. అక్కడి ప్రజలు ఒక్కొక్కరు సంవత్సరానికి దాదాపు 170 కిలోలకుపైగా మాంసం తింటారట! బీఫ్, చికెన్, సీఫుడ్ అన్నీ వారి రోజువారీ భోజనంలో భాగమే.
2 ఐస్లాండ్
గొర్రె మాంసం, చికెన్, చేపలు ఎక్కువగా తింటారు.
3 మకావో
పంది మాంసం, చికెన్ వంటకాలు చాలా ప్రాచుర్యం పొందాయి.
4 లిథువేనియా
ఇక్కడ 96% మంది ప్రజలు రోజూ మాంసం తింటారని నివేదిక చెబుతుంది. పోర్క్, బీఫ్, చికెన్ వీరి భోజనంలో సర్వ సాధారణం.
5 అర్జెంటీనా
గోవు మాంసం ఇక్కడి ప్రజల ప్రియమైనది. ఒక్కో వ్యక్తి ఏడాదికి సుమారు 110 కిలోలకుపైగా మాంసం తినగలరట.
6ఆస్ట్రేలియా
బీఫ్, లాంబ్, చికెన్, చేపలు — ఇవన్నీ ఇక్కడ సాధారణ ఆహారం మాంసం ప్రధాన ఆహారంగా మారింది.
7 న్యూజీలాండ్
గొర్రె మాంసం, బీఫ్, చేపలు ఎక్కువగా తింటారు. ఇక్కడ పశుసంవర్ధక రంగం చాలా పెద్దది కాబట్టి.
8 అమెరికా
అమెరికన్లు మాంసం లేకుండా భోజనం చేయడం అరుదు. బర్గర్లు, స్టేక్స్, బేకన్ వంటకాలు రోజువారీ ఆహారంలో భాగం. సగటుగా 110 కిలోలకుపైగా మాంసం తింటారట.
9 స్పెయిన్..
పోర్క్, చికెన్, సీఫుడ్ వంటకాలు స్పానిష్ ప్రత్యేకత.
10 ఇజ్రాయెల్ ప్రజలు టర్కీ కోడి ఇష్టంగా తింటారు తర్వాత స్థానాల లో చికెన్, బీఫ్ వంటకాలు ప్రజల్లో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారట.
ఈ దేశాలు చల్లటి వాతావరణం, ప్రోటీన్ అవసరం, ఆర్థిక స్థితి వంటి అంశాలు ఈ దేశాల్లో మాంసాహారం ఎక్కువగా ఉండడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
మొత్తం మీద అధికంగా యూరోప్ దేశాలే మాంసాన్ని అధికంగా ఇష్టపడుతున్నాయి. ఆసియా దేశాలు తటస్థంగా మాంసాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆఫ్రికా దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అక్కడ అభివృద్ధి అనేది తక్కువ రేట్ లో ఉంది కాబట్టి వారు ఆహారాన్ని పరిమితంగా మాత్రమే సమకూర్చుకోగలుగుతున్నారు. అదేవిధంగా పూర్వీకుల విధానాన్ని అవలంభించుకోవడం ద్వారా వేట ద్వారానే వాళ్ళు ఎక్కువ మాంసం వైపు మొగ్గు చూపుతున్నారు.
అయితే ఈ లిస్టులో భారతదేశం చాలా వెనుక ఉంది.
దానికి కారణం మన మతపరమైన విశ్వాసాలు, శాకాహార జీవనశైలి. Statista వివరాల ప్రకారం భారతదేశంలో కేవలం 53 శాతం మంది మాత్రమే మాంసం తింటారు మిగతావారు శాకాహారం లేదా వీగన్ డైట్ ఫాలో అవుతున్నారు. పట్టణాల్లో మాత్రం యువతలో మాంసాహారం అలవాటు వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.