RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Donald Trump: ట్రంప్‌పై హత్యాప్రయత్నం.. ఉలిక్కిపడే వీడియో విడుదల! 355 అడుగుల దూరంలోనే.. Special Trains: ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు - హాల్ట్ స్టేషన్లు ఇవే! Digital Payments: 8 దేశాల్లో యూపీఐ సేవలు.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముద్ర! యూపీఐ నుంచి ఐఎంపీఎస్ వరకు.. అన్నీ రికార్డులే.. Trump: భద్రత కంటే అందమే ముఖ్యం.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను నిరాకరించిన అమెరికా అధ్యక్షుడు.! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య.. AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mango Health Benefits: ఆరోగ్యానికి 'కల్పవృక్షం'.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఒక అద్భుత ఔషధమని మీకు తెలుసా? RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Donald Trump: ట్రంప్‌పై హత్యాప్రయత్నం.. ఉలిక్కిపడే వీడియో విడుదల! 355 అడుగుల దూరంలోనే.. Special Trains: ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు - హాల్ట్ స్టేషన్లు ఇవే! Digital Payments: 8 దేశాల్లో యూపీఐ సేవలు.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముద్ర! యూపీఐ నుంచి ఐఎంపీఎస్ వరకు.. అన్నీ రికార్డులే.. Trump: భద్రత కంటే అందమే ముఖ్యం.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను నిరాకరించిన అమెరికా అధ్యక్షుడు.! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య.. AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mango Health Benefits: ఆరోగ్యానికి 'కల్పవృక్షం'.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఒక అద్భుత ఔషధమని మీకు తెలుసా?

Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి..

Prajavedhika: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ప్రధానంగా వైసీపీ నేతల అండతో జరిగిన భూ కబ్జాలు, రెవెన్యూ అధికారుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆధార్ బ్లాక్ చేసి భూములు ఆక్రమించడం, రికార్డుల్లో పేర్లు మార్చడం వంటి తీవ్రమైన ఆరోపణలను బాధితులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటిపై విచారణ జరిపి త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.

Published : 2026-04-30 19:06:00

Politics- సర్వే రిపోర్ట్ ఉన్నా పట్టా ఇవ్వరా…

లేఅవుట్ ప్లాన్ లో రెండడుగుల భూమి మాయం....

ముత్తాతల భూమి కబ్జా.. రాజకీయ అండతో రెవెన్యూ రికార్డులు తిరగరాసిన ఘనులెవరు?

Prajavedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన 'ప్రజా వినతుల స్వీకరణ' కార్యక్రమం వేలాది మంది బాధితుల ఆర్తనాదాలతో హోరెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సామాన్య ప్రజలు తాము గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న భూ కబ్జాలు, అధికారుల నిర్లక్ష్యం మరియు రాజకీయ వేధింపులపై నేతలకు మొరపెట్టుకున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్‌ శావల దేవదత్ లు అర్జీలను స్వీకరించి, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఉదంతాలు రెవెన్యూ వ్యవస్థలో జరిగిన అక్రమాలను అద్దం పడుతున్నాయి.

ముఖ్యంగా భూముల ఆక్రమణకు సంబంధించి బాధితులు సమర్పించిన ఫిర్యాదులు విస్మయానికి గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన రామనాధరెడ్డి అనే రైతు, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా వైసీపీ సానుభూతిపరుల ఒత్తిడి వల్ల అధికారులు భూమిని అప్పగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విజయ అనే మహిళ ఫిర్యాదు చేస్తూ, తన భూమిని అక్రమంగా వేరొకరి పేరు మీదకు మార్చడానికి అధికారులు తన ఆధార్ కార్డును బ్లాక్ చేసి, ఓటీపీ రాకుండా చేసి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. ఇలాంటి హైటెక్ దందాలు విన్న నేతలు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.

వారసత్వ భూముల విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన రంగస్వామిరావు, తమ ముత్తాతల కాలం నాటి 14 ఎకరాల భూమిని వైసీపీ నేతల అండతో కౌలుదారులు తమ పేర్ల మీదకు మార్చుకున్నారని ఆధారాలతో సహా వివరించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్ల వల్ల పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అలాగే పల్నాడు జిల్లాకు చెందిన మరో బాధితుడు శ్రీనివాస్, ప్రభుత్వ సర్వే పేరుతో రికార్డుల్లో మార్పులు చేసి కొత్త పాస్ పుస్తకం ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని విన్నవించుకున్నారు.

మహిళలు మరియు వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ కార్యక్రమంలో వెల్లువెత్తాయి. కాకినాడ జిల్లాకు చెందిన కొండ ముత్యాలమ్మ, తన భర్త చనిపోయిన తర్వాత వారసత్వంగా రావాల్సిన భూమిలో కొంత భాగాన్ని అధికారులు రికార్డుల్లో ఎక్కించకుండా కాలయాపన చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మాజీ అనే మహిళ తన అత్తగారు జీవనోపాధి కోసం ఇచ్చిన కొండ పోరంబోకు భూమిని పట్టాదారు పాస్ బుక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అధికారులపై ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తయినా, రిపోర్టులు చేతికి వచ్చినా ఆన్‌లైన్ లో నమోదు చేయకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూ సమస్యలతో పాటు సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణ నిధుల విడుదల వంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి. నిరుద్యోగ యువత తమ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి రెస్యూమ్ లు అందజేయగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఆర్థిక సహాయం కోరారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన కూటమి నేతలు, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ కష్టాలు తీరుతాయని ఆశతో బాధితులు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలిరావడం గమనార్హం.

Spotlight

Read More →