Chandrababu Naidu: హంద్రీ-నీవా చరిత్రలో సరికొత్త రికార్డు..! రాయలసీమకు 40 టీఎంసీల నీటి వరం!

హంద్రీ-నీవా ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని కేవలం 190 రోజుల్లో రాయలసీమకు తరలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన రికార్డు సృష్టించింది. సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు, నిరంతర పర్యవేక్షణతో సాగునీటి రంగంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది.

2026-01-23 21:49:00
Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్!


రాయలసీమ సాగునీటి చరిత్రలో హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని కేవలం 190 రోజుల్లోనే రాయలసీమ జిల్లాలకు తరలించి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అరుదైన రికార్డును నెలకొల్పింది. డిజైన్ చేసిన సామర్థ్యాన్ని మించి ఇంత భారీగా నీటిని తరలించడం రాష్ట్ర నీటి ప్రాజెక్టుల చరిత్రలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఈ విజయం రాయలసీమ ప్రాంతానికి సాగునీటి భరోసాను మరింత బలపరుస్తోంది.

Nara Lokesh: యువత ఆశలకు ప్రతీకగా నారా లోకేష్... బర్త్‌డే స్పెషల్!

ఈ చారిత్రక విజయం నేపథ్యంలో రాయలసీమకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ముందుచూపు, పక్కా ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ ఘనత సాధ్యమైందని మంత్రులు కొనియాడారు. గతంలో ఒక్క పంపుతోనే నీటిని తరలించే పరిస్థితి ఉండేదని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్యను 6 పంపులకు పెంచామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 12 పంపులకు విస్తరించామని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. ఇది ప్రాజెక్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేసిన కీలక అడుగుగా పేర్కొన్నారు.

Amaravati: రాజధానిలోనే తొలి గణతంత్ర వేడుకలు! చరిత్ర సృష్టించనున్న అమరావతి..!

హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులను కేవలం 100 రోజుల్లో పూర్తి చేయడం కూడా మరో రికార్డని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. హంద్రీ-నీవా వ్యవస్థలో భాగమైన మచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం కీలక మలుపుగా మారిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. మచ్చుమర్రి ప్రాజెక్టు వల్లే ప్రస్తుతం ఈ స్థాయిలో నీటిని రాయలసీమకు తరలించగలుగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణ, అధికారులపై స్పష్టమైన దిశానిర్దేశమే ఈ ఫలితాలకు కారణమని మంత్రులంతా ఏకగ్రీవంగా పేర్కొన్నారు.

Faria Abdullahs: ప్రేమ వల్లే నాలో మార్పు వచ్చింది.. ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ టచ్!

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రికార్డుతో తృప్తి చెందవద్దని స్పష్టం చేశారు. హంద్రీ-నీవా ద్వారా 50 టీఎంసీల వరకు నీటిని తరలించి రాయలసీమలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ నిండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జలాశయాలు నిండినప్పుడే తనకు నిజమైన సంతృప్తి ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. సీఎం ఆదేశాల మేరకు ఫిబ్రవరి చివరినాటికి లేదా మార్చి తొలి వారంలోగా అదనంగా మరో 10 టీఎంసీల నీటిని తరలించి మొత్తం 50 టీఎంసీల లక్ష్యాన్ని చేరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. ఈ ప్రణాళిక అమలుతో రాయలసీమకు శాశ్వత సాగునీటి భవిష్యత్తు మరింత దగ్గర అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Tirumala: శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం బంపర్ ఆఫర్... రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే!
లోకేష్ జన్మదినం వేడుకలు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సిబ్బందికి NRI... అధ్యక్షులు పల్లా చేతుల మీదుగా..
ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది... ఆ ఎత్తిపోతల పథకానికి కేంద్ర కమిటీ గ్రీన్ సిగ్నల్.!
Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం!
Bahubali Phone: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి పని..! రియల్‌మీ కొత్త బ్యాటరీ సంచలనం!
Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!

Spotlight

Read More →