7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! Silver: బంగారానికే కాదు వెండికీ పండుగే..! రూ.3 లక్షల దిశగా దూసుకెళ్తున్న తెల్లని లోహం! ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! Silver: బంగారానికే కాదు వెండికీ పండుగే..! రూ.3 లక్షల దిశగా దూసుకెళ్తున్న తెల్లని లోహం! ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే!

ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు!

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహీంద్రా (Mahindra) పేరే వినిపిస్తోంది. గతంలో కేవలం డీజిల్, పెట్రోల్ ఎస్‌యూవీలకే పరిమితమైన మహీంద్రా, ఇప్పుడు ఎలక్ట

2026-01-07 18:09:00

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహీంద్రా (Mahindra) పేరే వినిపిస్తోంది. గతంలో కేవలం డీజిల్, పెట్రోల్ ఎస్‌యూవీలకే పరిమితమైన మహీంద్రా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్‌ను కూడా తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవలే XUV 7XOను విడుదల చేసిన ఉత్సాహంలో ఉన్న మహీంద్రా, కేవలం ఒక్క రోజు గ్యాప్‌లోనే మోస్ట్ అవేటెడ్ XUV 3XO EVని మార్కెట్లోకి వదిలి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో, ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు విశేషాలు మీకోసం.. మహీంద్రా XUV 3XO EVని ముఖ్యంగా రెండు వేరియంట్లలో తీసుకువచ్చింది.

AX5 మరియు AX7L: ఈ రెండు వేరియంట్లు కూడా విభిన్న ఫీచర్లతో ప్యాక్ అయి ఉన్నాయి.
ఎక్స్-షోరూమ్ ధర: దీని ప్రారంభ ధర రూ. 13.89 లక్షల నుంచి మొదలై, టాప్ మోడల్ రూ. 14.96 లక్షల వరకు ఉంటుంది. ఇతర ఈవీ కార్లతో పోలిస్తే ఈ ధర చాలా పోటీగా ఉందని చెప్పవచ్చు.

ఈ కారు పనితీరు విషయంలో మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. ఇందులో 39.4 kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 285 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది సిటీ డ్రైవింగ్‌కు, ఆఫీసు ప్రయాణాలకు మరియు చిన్నపాటి వీకెండ్ ట్రిప్పులకు సరిగ్గా సరిపోతుంది. దీని మోటార్ 110 kW శక్తిని, 310 Nm భారీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే మీరు ఎక్సలరేటర్ తొక్కగానే కారు దూసుకుపోతుంది. కేవలం 8.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం విశేషం.

డ్రైవింగ్ చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండేందుకు మహీంద్రా ఇందులో మూడు ప్రత్యేక 'మల్టీ-డ్రైవ్ మోడ్స్' ఇచ్చింది. అవేంటంటే.. ప్రశాంతంగా, పొదుపుగా డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు. కొంచెం వేగంగా వెళ్లాలనుకున్నప్పుడు. కారు పూర్తి శక్తిని ఉపయోగించి అడ్వెంచరస్‌గా డ్రైవ్ చేయడానికి.

బయట నుంచి చూస్తే ఈ కారు చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. R16 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ డీఆర్ఎల్ (DRL)లు మరియు వెనుక వైపు సిగ్నేచర్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్‌తో కారు చాలా రిచ్‌గా కనిపిస్తుంది. లోపల కూర్చుంటే ఒక విలాసవంతమైన గదిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. సింగిల్-పేన్ సన్‌రూఫ్ వల్ల క్యాబిన్ చాలా విశాలంగా అనిపిస్తుంది.

నేటి తరం యువత కోరుకునే అన్ని టెక్ ఫీచర్లను మహీంద్రా ఇందులో జొప్పించింది. రెండు 10.25-అంగుళాల HD స్క్రీన్‌లు ఉంటాయి. ఒకటి పాటలు, మ్యాప్స్ కోసం (Infotainment), మరొకటి స్పీడోమీటర్ మరియు కారు సమాచారం కోసం (Instrument Cluster). డ్యూయల్-జోన్ ఏసీ, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు వర్షం పడగానే దానంతట అవే తిరిగే రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి. ట్రాఫిక్‌లో కారును ఆపినప్పుడు 'ఆటో హోల్డ్' ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

Spotlight

Read More →