Education: పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: మంత్రి డోలా! TDP: లిక్కర్ స్కామ్‌లో కొత్త కోణాలు.. కేఎన్ఆర్ ఆస్తులపై తీవ్ర ఆరోపణలు.. పట్టాభి కీలక వ్యాఖ్యలు! Thalliki Vandanam: తల్లికి వందనం డేటా వెరిఫికేషన్ షురూ... తల్లుల ఖాతాల్లో రూ. 15,000 జమ!! Praja Darbar: ప్రజల సమస్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి.. రాయచోటి నివాసంలో ప్రజా దర్బార్! Amit Shah: కచ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన! Indian Economy: కేంద్ర సర్కార్‌కు ఆర్బీఐ బంపర్ డివిడెండ్: రికార్డు స్థాయిలో రూ. 2.87 లక్షల కోట్ల మిగులు నిధుల బదిలీ! Minister Narayana: డంపింగ్ యార్డ్‌ల రహిత మున్సిపాలిటీల దిశగా ఏపీ ప్రభుత్వం! Amit Shah: మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు! Chandrababu: మహానాడులో పసుపు దండు ఉదారత.. రెండు రోజుల్లో టీడీపీకి రూ. 25.61 కోట్ల విరాళాల వెల్లువ! Hydrogen Train: తొలి హైడ్రోజన్ రైలుకు కేంద్రం పచ్చజెండా! గంటకు 75 కిలోమీటర్ల వేగం... సేఫ్టీ క్లియరెన్స్ పూర్తి! Education: పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: మంత్రి డోలా! TDP: లిక్కర్ స్కామ్‌లో కొత్త కోణాలు.. కేఎన్ఆర్ ఆస్తులపై తీవ్ర ఆరోపణలు.. పట్టాభి కీలక వ్యాఖ్యలు! Thalliki Vandanam: తల్లికి వందనం డేటా వెరిఫికేషన్ షురూ... తల్లుల ఖాతాల్లో రూ. 15,000 జమ!! Praja Darbar: ప్రజల సమస్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి.. రాయచోటి నివాసంలో ప్రజా దర్బార్! Amit Shah: కచ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన! Indian Economy: కేంద్ర సర్కార్‌కు ఆర్బీఐ బంపర్ డివిడెండ్: రికార్డు స్థాయిలో రూ. 2.87 లక్షల కోట్ల మిగులు నిధుల బదిలీ! Minister Narayana: డంపింగ్ యార్డ్‌ల రహిత మున్సిపాలిటీల దిశగా ఏపీ ప్రభుత్వం! Amit Shah: మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు! Chandrababu: మహానాడులో పసుపు దండు ఉదారత.. రెండు రోజుల్లో టీడీపీకి రూ. 25.61 కోట్ల విరాళాల వెల్లువ! Hydrogen Train: తొలి హైడ్రోజన్ రైలుకు కేంద్రం పచ్చజెండా! గంటకు 75 కిలోమీటర్ల వేగం... సేఫ్టీ క్లియరెన్స్ పూర్తి!

Hydrogen Train: తొలి హైడ్రోజన్ రైలుకు కేంద్రం పచ్చజెండా! గంటకు 75 కిలోమీటర్ల వేగం... సేఫ్టీ క్లియరెన్స్ పూర్తి!

Hydrogen Train: భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ రైలు సర్వీసుల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే బోర్డు ఆమోదం తెలిపాయి. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 కోచ్‌లతో పూర్తి స్వదేశీ సాంకేతికతతో నడవబోయే ఈ రైలు, ಕాలుష్య పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ప్రస్తుతం లోకో పైలట్ల శిక్షణ పూర్తి చేసుకుంటున్న ఈ రైలు రాబోయే ఆగస్టు నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

Published : 2026-05-29 11:26:00

Politics- హర్యానాలో భారత్ తొలి హైడ్రోజన్ రైలు సర్వీసులు.. రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్!

ఆగస్టు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న స్వదేశీ హైడ్రోజన్ రైలు!

పొగకు బదులు నీటి ఆవిరి మాత్రమే.. పర్యావరణ హితంగా భారత తొలి హైడ్రోజన్ రైలు!

Hydrogen Train: భారతీయ రైల్వే రవాణా రంగంలో ఒక సరికొత్త చరిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత గ్రీన్ ‘హైడ్రోజన్ రైలు’ను పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడవబోయే ఈ సరికొత్త రైలు కమర్షియల్ సర్వీసుల ప్రారంభానికి రైల్వే బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విజయవంతమైతే, ప్రపంచంలోనే హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న జర్మనీ, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ కూడా నిలవనుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బ్రాడ్ గేజ్ ట్రాక్‌పై నడిచే అత్యంత శక్తివంతమైన రైలుగా దీనిని రూపొందించడం విశేషం.

మొత్తం 10 కోచ్‌లతో రూపొందించిన ఈ గ్రీన్ రైలులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది సాధారణ ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. జింద్-సోనిపట్ రూట్‌లో గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ రైలు వేగంగా వేగాన్ని అందుకోవడానికి, అలాగే వెంటనే వేగాన్ని తగ్గించడానికి వీలుగా ‘డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్’ సాంకేతికతను ఉపయోగించారు. బ్రాడ్ గేజ్ ట్రాక్ పై నడిచే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇదే కావడం గమనార్హం.

ఈ రైలు నిర్వహణ కోసం హర్యానాలోని జింద్‌లో అధునాతన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, వాటర్ ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా పర్యావరణ హిత ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఈ రైలు మెయింటెనెన్స్ కోసం ఢిల్లీకి తరలించే సమయంలో భద్రతా నిబంధనల ప్రకారం హైడ్రోజన్ పవర్ సిస్టమ్ ఆపేసి డీజిల్ ఇంజన్ సహాయంతో లాగుతారు. సాంప్రదాయ డీజిల్ రైళ్లతో పోలిస్తే ఈ హైడ్రోజన్ రైళ్లు ఎలాంటి హానికర వాయువులను విడుదల చేయవు. కెమికల్ రియాక్షన్ ద్వారా విద్యుత్ తయారయ్యాక, ఈ రైలు సైలెన్సర్ నుండి కాలుష్య పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే పర్యావరణంలోకి విడుదలవుతుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) నుండి అన్ని రకాల క్లియరెన్సులు లభించాయి. మొదటి మూడు నెలల పాటు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే తక్షణమే స్పందించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన టెక్నికల్ గ్రూప్ నిరంతరం ఈ రైల్లోనే ప్రయాణించనుంది. ప్రస్తుతం తుది తనికీలు మరియు లోకో పైలట్ల శిక్షణ ముగింపు దశకు చేరుకున్నాయి. రాబోయే ఆగస్టు నాటికి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

హైడ్రోజన్ రైలు విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని మార్గాల్లో ఇలాంటి గ్రీన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది కేవలం రైల్వే ప్రయాణాన్ని మార్చడమే కాకుండా దేశంలో కాలుష్య నివారణకు ఎంతో దోహదపడుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేలా ఈ ప్రాజెక్ట్ నిలవనుంది. దేశ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికే ఈ ప్రయాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Spotlight

Read More →