తేదీ 27-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 27 డిసెంబర్ 2025 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ పొంగూరు నారాయణ గారు (గౌరవనీయ మంత్రి).
2. శ్రీ డేగల ప్రభాకర్ గారు (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIDCL) చైర్మన్)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 24 డిసెంబర్ 2025 న ‘ప్రజా వేదిక’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయ మంత్రి శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు హాజరయ్యారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, భూ సమస్యలు, అభివృద్ధి అంశాలు, వ్యక్తిగత సమస్యలపై వారు స్పందించారు. అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను వినడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ నేతలు తెలిపారు.