ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

CBN: అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు.. జీఎస్టీ అమలు దేశానికి గేమ్‌చేంజర్.. చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సంస్కరణలపై విశదీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ అమలు పేదల జీవ

Published : 2025-09-18 17:46:00
PM KISSAN: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! 21వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సంస్కరణలపై విశదీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ అమలు పేదల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. గతంలో సీఎస్టీ, వ్యాట్ వంటి పన్ను విధానాలు ఉండేవి. అప్పట్లో 17 రకాల పన్నులు, 13 రకాల సర్‌ఛార్జీలు ఉండేవి. ఇవన్నీ వాణిజ్య వ్యవస్థకు భారంగా మారాయని గుర్తు చేశారు. వాజ్‌పేయీ హయాంలో జీఎస్టీ రూపకల్పన ప్రారంభమైందని, అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి అందరినీ ఒప్పించి అమలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

Recharge: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే యాన్యువల్ ప్లాన్స్ రివ్యూ..!

జీఎస్టీ ప్రవేశం దేశ ఆర్థిక వ్యవస్థకు గేమ్‌చేంజర్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెండో తరం సంస్కరణలు తీసుకువచ్చారని, ఈ మార్పులకు తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి అవుతుందని, సంపద సృష్టి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ఆదాయం వచ్చినప్పుడు సంక్షేమం, అభివృద్ధి రెండూ సాధ్యమవుతాయని ఆయన వివరిస్తూ, అప్పులు చేసి సంక్షేమం అందించడం సరైంది కాదని స్పష్టం చేశారు. తన నమ్మకం ప్రకారం దేశం, రాష్ట్రం దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్! టైమింగ్... పూర్తి వివరాలు!

గతంలో పన్ను విధానంలో నాలుగు శ్లాబులు (5%, 12%, 18%, 28%) ఉండేవని గుర్తు చేశారు. ఒకే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ఉత్పత్తులు వస్తే వాటికి వేరువేరు పన్నులు విధించడం గందరగోళానికి దారి తీసేదని వివరించారు. ప్రస్తుతం పన్నుల వ్యవస్థను సరళతరం చేస్తూ రెండు శ్లాబులుగా (5%, 18%) మార్చారని, దీని వల్ల వ్యాపారులకు, వినియోగదారులకు సౌలభ్యం కలిగిందని చెప్పారు.

సైకిల్ పై నగర సంచారం, పడవల్లో కలల యాత్ర, పూల తోటల్లో నడక – పర్యాటకులకు మరువలేని అనుభవాలతో నిండిన ఒక మాయాజాల దేశం!!

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా పరోక్ష పన్ను చెల్లింపుదారులు 132 శాతం పెరిగారని ఆయన తెలిపారు. 2017లో కేవలం 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 1.51 కోట్లకు పెరిగిందని చెప్పారు. జీఎస్టీ రిసిప్టుల ద్వారా 2018లో రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే లభించగా, ప్రస్తుతం రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం వస్తోందని వివరించారు.

ED: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు! ఈడీ ఎంట్రీతో ఐదు రాష్ట్రాల్లో సోదాలు..!

‘వన్ నేషన్–వన్ విజన్’ నినాదంతో దేశం ముందుకు సాగుతుందని, భారత్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే దేశంగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త పన్ను విధానాల వల్ల వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల అదనపు వనరులు సమకూరతాయని చెప్పారు.

ICC rankings: ICC ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా హవా.. అగ్రస్థానంలో!

జీఎస్టీ సంస్కరణలు చివరి వ్యక్తికి చేరి ప్రయోజనం కలిగించాలన్నది ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద, జీఎస్టీ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచి, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే కీలక సంస్కరణగా నిలిచిందని ఆయన ప్రసంగం ప్రతిధ్వనించింది.

TTD: వాహనసేవలతో పాటు మూలవిరాట్‌ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..! భక్తులకు భరోసా ఇచ్చిన టీటీడీ..!
Trump tweet: ట్రంప్ తీవ్ర ఆరోపణ.. భారత్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు!
APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ అప్రెంటిస్ నియామకాలు! జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇదిగో..!
Trump: బిట్‌కాయిన్ చేతబట్టి ట్రంప్ బంగారు విగ్రహం! అదే రోజు ఫెడ్ వడ్డీ రేట్ల కోత..!
Trains Updates: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో 8 రైళ్లు రద్దు! ఏ రూట్లలో అంటే? వివరాలు ఇవే!
Gold River: ఈ నదిలో కుప్పలు తెప్పలుగా బంగారం.. గోల్డ్ సేకరించేందుకు ఎగబడుతున్న స్థానికులు! ఎక్కడో తెలుసా.?
Indias big win: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. 102 పరుగుల తేడాతో గెలుపు!
Housing Scheme: ఏపీ ప్రజలకు పండగే పండగ! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వచ్చే మార్చి కి అందరికీ ఇల్లు!

Spotlight

Read More →