Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు! Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

AI Services AP Farmers: చంద్రబాబుకు, బిల్ గేట్స్‌కు రైతుల ఆత్మీయ స్వాగతం.. ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం!

AP Farmers Welcome CBN Bill Gates: వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్వయంగా పరిశీలించారు.

Published : 2026-02-16 19:35:00
  • సాగులో యాప్, డ్రోన్ల వినియోగం పరిశీలన
     
  • వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్

AP Farmers Welcome CBN Bill Gates: వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం సందర్శించిన గేట్స్‌కు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. వ్యవసాయం-అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. అలాగే నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్‌బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు. 

ఈ సందర్భంగా మహిళా రైతులు మణి, అన్నపూర్ణ... ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్  రైతు యాప్‌ గురించి గేట్స్‌కు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఏఐ ద్వారా పంట తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును తెలిపారు. బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏఐ టూల్ ఉపయోగించి, వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. 

ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా, మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ స్ప్రే చేసింది. ఇది స్వయంగా చూసిన బిల్ గేట్స్... రైతులకు ఏఐ-అగ్రి టెక్ సేవలు అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మరోవైపు స్థానిక రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. మొదటగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. వారు స్వయంగా వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. ఈ సందర్భంగా సేంద్రీయ సాగు పద్దతులతో పండించిన ఉత్పత్తులను బిల్ గేట్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spotlight

Read More →