సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మరో సంచలన పథకం అమలు చేయబోతున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మందికి ఆర్థికంగా భరోసా లభించనుంది. ఇంతకీ సీఎం చంద్రబాబు ఏ పథకం గురించి అసెంబ్లీలో ప్రకటన చేశారంటే? కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సూపర్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా భారీ మోజార్టీతో గెలుపొందిని కూటమి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించింది.
ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గతేడాది దీపావళి కానుకగా రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించారు. దీంతో పాటుగా అధికారం చేపట్టిన రోజే పెన్షన్ రూ.4,000లకు పెంచారు. దీంతో పాటుగా అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. తాజాగా మరో సంచలన పథకంపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెల నెలా నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన చంద్రబాబు.. నిరుద్యోగ భృతికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3,000లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని.. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించి నిరుద్యోగులను ఆర్థికంగా ఆదుకుని, చదువుకునేలా ప్రోత్సహిస్తామని మాటిచ్చారు. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై సీఎం చంద్రబాబు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ పథకం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అలాగే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. కొత్తగా నియమించి ఉపాధ్యాయులతోనే నూతన విద్యాసంవత్సరం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటుగా మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. వాటన్నింటినీ ఎప్పుడు అమలు చేస్తామన్నది కూడా వెల్లడించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం మే నెలలోనే అందిస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నాసరే వారందరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామన్నారు. దీంతో పాటుగా గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అందించిన పంట సాయం పేరును అన్నదాత సుఖీభవగా రూ.20,000లు అందిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 6,000తో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితో కలిసి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మూడు విడతల్లో ఏప్రిల్‌లోనే మొదట విడతగా అందిస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి:
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!
మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: