Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

AP Budget: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ బడ్జెట్..! భారీ కేటాయింపులతో పయ్యావుల కేశవ్...!

AP Budget: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాన్ని ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, ఎన్టీఆర్ భరోసా, మహిళా శక్తి, MSMEలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ సంక్షేమం–అభివృద్ధి సమతౌల్యంతో బడ్జెట్(Budget) రూపొందించారు.

Published : 2026-02-14 14:10:00

అమరావతిని ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దే మహా ప్లాన్…

ఎన్టీఆర్ భరోసాకు 27,719 కోట్లు…

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్…

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 'స్వర్ణాంధ్ర 2047' అనే గొప్ప లక్ష్యంతో రూపొందించబడింది. రాష్ట్రాన్ని గతంలో జరిగిన ఇబ్బందుల నుండి బయటపడేసి, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. వ్యాపారాలు సులభంగా చేసుకునేలా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని ప్రభుత్వం పాటిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించి, కొత్త పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమం కోసం అత్యధికంగా 51,021 కోట్ల రూపాయలను కేటాయించారు. అలాగే ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు కేటాయించారు. మైనార్టీల సంక్షేమానికి 6,090 కోట్లు మరియు అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) సంక్షేమం కోసం 10,699 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ భారీ నిధులు ఆయా వర్గాల ఆర్థిక ఎదుగుదలకు మరియు సామాజిక సమానత్వానికి ఎంతో తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

పేదలకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకానికి 27,719 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. మహిళల ఆర్థిక స్వాలంబన కోసం 'స్త్రీ శక్తి' పథకానికి 1,420 కోట్లు కేటాయించారు. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి, ఏప్రిల్ 1 నుంచి వారికి ప్రత్యేక విద్యుత్ రాయితీలు ప్రకటించారు. దీని ప్రకారం చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో నేతన్నల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభిస్తుంది.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా అమరావతిని తొమ్మిది జిల్లాలతో కలిపి ఒక పెద్ద ఆర్థిక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లు, గృహ నిర్మాణానికి సుమారు 6,357 కోట్లు కేటాయించారు. ఇంధన రంగానికి 13,934 కోట్లు, మౌలిక సదుపాయాల శాఖకు 1,283 కోట్లు ఇచ్చారు. రాయలసీమ రైతుల సాగునీటి కలలను నెరవేరుస్తామని, శ్రీకాకుళం జిల్లా యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించి గుండె నిబ్బరాన్ని ఇస్తామని మంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

చిన్న తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి కోసం 3,161 కోట్ల రూపాయలు కేటాయించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. ఐటీ రంగానికి 536 కోట్లు, అటవీ మరియు పర్యావరణ రక్షణకు 714 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖకు 3,000 కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నారు. అలాగే 94 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ఏపీ పోలీస్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు భరోసా ఇస్తూ పంటల బీమా కోసం 250 కోట్లు కేటాయించారు. ఇలా అన్ని రంగాల కలయికతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేలా ఈ బడ్జెట్ రూపొందింది.
 

Spotlight

Read More →